టాలీవుడ్ సాక్షిగా జరుగుతున్న డ్రగ్స్ మహమ్మారిపై అందరూ ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు…అసలు ఈ వ్యవహారం అంత హీట్ ఎక్కడానికి అసలు కారణం మీడియా అనేది ఒప్పుకోక తప్పని నిజం…అయితే దాదాపుగా 27మంది సభ్యుల జాతకాలు సిట్ కి చిక్కగా…అందులో 12 మందికి నోటీసులు అందడం, ఇక ఒకరి తరువాత ఒకరు సిట్ ముందు హాజరు కావడం మనం చూస్తూనే ఉన్నాం…అయితే అదే క్రమంలో ఈ వ్యవహారంలో చార్మీ సైతం ఉండడం…ఆమె సైతం సిట్ కి హాజరు కావాల్సి ఉండడం మనకు తెలిసిందే…అయితే మరో రెండు రోజుల్లో చార్మీ సిట్ ముందు హాజరు కావాల్సి ఉండగా..అనుకోకుండా హైకోర్ట్ ను ఆశ్రయించి భారీ షాక్ ఇచ్చింది..చార్మీ….ఆమె ఇచ్చిన ట్విష్ట్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది…అయితే ఆమె హైకోర్ట్ కి అందించిన పిటీషన్ లో…ఆమె ఏం పేర్కొంది అంటే…సిట్ విచారణ తీరు బాగోలేదని అంతేకాకుండా…విచారణలో భాగంగా గోళ్లు రక్త నమూనాలు సేకరించటం పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా శాంపిల్స్ సేకరించటం సరికాదంటూ ఒక రూల్ ను ఛార్మీ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చింది. అదేవిధంగా విచారణకు హాజరయ్యే పక్షంలో తన వెంట న్యాయవాదిని కూడా అనుమతించాలని చార్మి కోరటం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. అయితే ఈ పిటీషన్ రేపు విచారణకు రాబోతున్న సందర్భంలో ఛార్మీ లేవనెత్తిన విషయాలతో ఉన్నత న్యాయస్థానం అంగీకరిస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా ఇప్పటివరకూ సిట్ ముందు హాజరయిన వాళ్ళ వ్యవహారం ఒక ఎత్తు అయితే…మరో పక్క చార్మీ మ్యాటర్ మాత్రం ఈ వ్యవహారాన్ని ఏదో కొత్త మలుపు తిప్పబోతుంది అని అర్ధం అవుతుంది…చూద్దాం మరి ఏం జరగబోతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.