సిట్‌ దర్యాప్తు అభ్యంతరకరంగా ఉందంటూ హైకోర్టును ఆశ్రయించిన ఛార్మీ

  • July 24, 2017 / 10:24 AM IST

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నటి చార్మి హైకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్‌ కేసులో బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరణ సరికాదని హైకోర్టులో పిటిషన్‌ వేసింది. విచారణ తీరు సరిగా లేదని చార్మి ఆరోపించింది. చార్మి పిటిషన్‌ మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అలాగే విచారణకు హాజరయ్యే సమయంలో అడ్వకేట్‌ను వెంట తీసుకు వెళ్లే వెసులుబాటు కల్పించాలని ఛార్మీ కోరారు.ఈ పిటిషన్‌ ఇవాళ మధ్యాహ్నం విచారణకు రానుంది. కాగా ఛార్మి ఎల్లుండి (బుధవారం) సిట్‌ ఎదుట హాజరు కానున్నారు.

మరోవైపు సిట్‌ నోటీసులు అందుకున్న హీరో నవదీప్‌ ఈ రోజు ఉదయం సిట్‌ అధికారుల ఎదుట హాజరయ్యారు. అయితే ఇప్పటివరకు ‘డ్రగ్‌ పెడ్లర్‌’ అని నిరూపించేందుకు ఒక్క ప్రముఖుడి నుంచి కూడా ఆధారాలు లభించలేదని విశ్వసనీయంగా తెలిసింది. కెల్విన్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకోవడం తప్పా మరొకరికి విక్రయించినట్టుగానీ, రవాణా చేసినట్టుగానీ ఎక్కడా ఒక్క ఆధారం దొరకలేదన్నది ఎక్సైజ్‌ ఉన్నతాధికారుల నుంచి వినిపిస్తున్న మాట.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus