అసలు ఛార్మి..అనుష్కను అడగాల్సిన మాటేనా అది..!

  • March 14, 2020 / 12:00 PM IST

స్వీటీ అనుష్క టాలీవుడ్ లో 15ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఆమె నటించిన మొదటి చిత్రం సూపర్ విడుదలై దాదాపు 15 ఏళ్ళు ఐపోతుంది. ఈ దశాబ్దన్నర కాలంలో అనుష్క ఎవరికీ అందనంత ఎత్తు ఎదిగారు. అనేక మరపురాని పాత్రలు చేశారు. వివాదరహితురాలిగా పేరున్న అనుష్కను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు.అందుకే చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు అందరూ కలిసి ఆమె సినిమా జర్నీని సెలెబ్రేట్ చేశారు. ఐతే ఈ కార్యక్రమంలో పూరి, ఛార్మి మాటలు అనుష్కను కొంచెం ఇబ్బందిపెట్టాయి. అనుష్క పెళ్లి అనేది టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ టాపిక్. తరచుగా ఆమె పెళ్లిపై అనేక రూమర్స్ వస్తూ ఉంటాయి.

ఈ వేడుకలో ఛార్మి డైరెక్ట్ గా అనుష్కను పెళ్లి ఎప్పుడు? అని అడిగి ఇబ్బంది పెట్టేసింది. దానికి సమాధానంగా అనుష్క నాకు కూడా తెలియదు..జరిగినప్పుడు అని తప్పించుకుంది. ఐతే ఛార్మికి కూడా ముప్పై ఏళ్ళు దాటిపోయాయి. ఆమె వయసు 32 ఏళ్ళు, అలాంటి ఛార్మి, అనుష్కను పెళ్లి ఎప్పుడు అని అడగడం విచిత్రం. ఛార్మి అధికారికంగా ఎవరిని పెళ్లి చేసుకోలేదు, అలాంటి ఆమె అనుష్క పెళ్లి గురించి అడగడం కొత్తగా తోచింది. ఇక పూరి కూడా తన మార్కు డైనమిజం స్టేజ్ పై చూపించాడు. హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడం నాకు నచ్చడంటూ, ఉన్న విషయాన్ని నవ్వుతూ చెప్పేశారు. ఐనా పాపం అనుష్క పెళ్లి విషయం ఎత్తి ఛార్మి తన గురించి ఆడియన్స్ ఆలోచించేలా చేసుకుంది.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus