పంజాబీ ముద్దుగుమ్మ (Charmi Kaur) ఛార్మీ “జ్యోతిలక్ష్మి” సినిమాలో టైటిల్ పాత్ర పోషించిన తర్వాత వెండితెర మీద మళ్ళీ కనిపించలేదు. కథానాయికగా సినిమాలకు స్వస్తి పలికిన ఛార్మీ.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కొత్త అవతారమెత్తింది. అంతే కాకుండా పూరీ జగన్నాధ్ కి సంబంధించిన “పూరీ కనెక్ట్స్”ను కూడా ఛార్మీ దగ్గరుండి మరీ చూసుకొంటుంది. అయితే.. ఈ బిజినెస్ రిలేషన్ వెనుక “పర్సనల్ రిలేషన్” ఉందని కొన్ని కథనాలు, గాసిప్పులు వినిపించాయి. వాటిని పూరీ జగన్నాధ్ కానీ ఛార్మీ కానీ ఎప్పుడూ ఖండించకపోవడంతో దాదాపుగా అందరూ అది నిజమేనేమో అనుకొన్నారు.
అయితే.. “మెహబూబా” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక మీడియా హౌస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో “పూరీ జగన్నాధ్ గారితో మీకున్న రిలేషన్ ఏమిటి?” అని ప్రశ్నించగా.. ఛార్మీ చాలా హుందాగా “ఇదే నేను గనుక ఒక హీరోయిన్ ని కాకపోతే మీరు ఈ క్వశ్చన్ వేసే వారు కాదు. ఇక మా రిలేషన్ కి ఒక పేరు అంటూ ఏమీ లేదు. ఏళ్లతరబడి సినిమాల్లో కథానాయికగా నటించిన నాను బోర్ కొట్టేసింది. అందుకే సినిమాలకి హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చి నాకెంతో ఇష్టమైన ప్రొడక్షన్ లోకి వచ్చాను. నేను ఒక హీరోయిన్ కాకుండా సాధారణ మహిళను అయితే ఎవరూ ఇలా అనుకొనేవారు కాదేమో. నేను హీరోయిన్ ని అవ్వడం వల్ల పూరీతో నాకు ఏదో సంబంధం ఉంది అంటూ గాసిప్పులు వ్యాపింపజేస్తున్నారు. అయినా నేను వాటిని అస్సలు పట్టించుకొను” అంటూ ఘాటుగానే స్పందించింది ఛార్మీ.