డ్రగ్స్ పై చార్మీ చేసిన ట్వీట్ ఏం చెబుతుంది?
- August 1, 2017 / 02:01 PM ISTByFilmy Focus
కధ ముగిసింది…ఈ మ్యాటర్ అంతటితో అయిపోయినట్లే…బ్యాక్ ఎండ్ లో మ్యాటర్ సెటిల్ అయినట్లే…పాపం సిట్ అధికారులతో మీడియా చేసిన హంగామా అంతా వృధా అనే వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్న తరుణంలో డ్రగ్స్ వ్యవహారం పై రకరకాల వార్తలు బయటకు వస్తూ ఉన్న తరుణంలో ఆ టాపిక్ కి కాస్త తనదైన శైలిలో టచ్ ఇస్తూ ట్వీట్ చేసింది చార్మి…అయితే చార్మీ ట్వీట్ లో ఏముంది…అసలు చార్మీ ఆలోచన ఏంటి అంటే…ఒక్కసారి మీరే ఈ మ్యాటర్ చదవండి…విషయంలోకి వెళితే… ‘‘ఒక తుపాన్ నుంచి బైటపడ్డావంటే.. నువ్వొక కొత్త జన్మ ఎత్తినట్లే. నీలో వున్న ఆ కొత్త శక్తిని నీకు తెలియజెప్పడమే ఆ తుపాను ఉద్దేశం” అంటూ హరుకి మురకామి అనే జపనీస్ రచయిత ‘కోట్’ ని పోస్ట్ చేసింది ఛార్మి.
అయితే డైరెక్ట్ గా చెప్పక పోయినా ఇన్‌డైరెక్ట్ గా చూసుకుంటే ఇక్కడ తుపాన్ అంటే ఛార్మీ చిక్కుకున్న డ్రగ్ వ్యవహారానికి సంబంధించిన నోటీసులు అని మనం అర్ధం చేసుకోవాలి…ఎందుకంటే మీడియా పుణ్యమా అని….టాలీవుడ్‌ని కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారంలో ఛార్మి ఉందంటూ జరిగిన రచ్చా అంతా ఇంతా కాదు…అయినా ఆమె బెదిరి పోకుండా కోర్ట్ మెట్లు ఎక్కి మరీ పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పోరాటాన్ని చూసి రామ్ గోపాల్ వర్మ ముచ్చటపడి ఆమెను ఝాన్సీలక్షితో కూద్ద పోల్చెసాడు. అయితే అదే క్రమంలో ఛార్మీ లేటెస్ట్ గా చేసిన ఈ ట్విట్ ను చూసిన వారికి మాత్రం టాలీవుడ్ సెలెబ్రెటీలు అంతా ఈ డ్రగ్స్ గండం నుండి బయటపడినట్లే అనుకోవాలి. అదే క్రమంలో ఈ కేస్ ఇక కొండెక్కినట్లే అని ఇట్టే అర్ధం అయిపోతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














