ఒత్తిడితో అల్లాడిపోతున్న హీరోయిన్ ఛార్మి

  • January 29, 2020 / 07:40 PM IST

ఛార్మి టెన్షన్ తో సతమతమైపోతున్నారట. ఒక వేళ ఒత్తిడికి క్యాలరీస్ కరిగిపోయే అవకాశమే ఉంటే తను సూపర్ మోడల్ అయ్యేదట. ట్విట్టర్ వేదికగా తను ఎదుర్కుంటున్న ఒత్తిడిని ఇలా వ్యంగంగా పంచుకుంది ఛార్మి. ఛార్మి అండ్ పూరి టీం ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ ఫస్ట్ షెడ్యూల్ ముంబై లో జరుగుతుంది. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా ఉన్న ఛార్మి బాధ్యతలతో ఒత్తిడి ఫీలవుతున్నారట. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస చిత్రాలు చేసిన ఛార్మి నటనకు గుడ్ బై చెప్పి నిర్మాణంపై దృష్టి పెట్టింది. పూరి కనెక్ట్స్ పేరుతో బ్యానర్ స్థాపించి దర్శకుడు పూరి, ఛార్మి కలిసి చిత్రాలు నిర్మిస్తున్నారు.

మొదటి చిత్రంగా ఛార్మి టైటిల్ రోల్ చేసిన ‘జ్యోతి లక్ష్మీ’ చిత్రం నిర్మించారు. ఐతే ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. ఐతే గత ఏడాది హీరో రామ్ తో పూరి చేసిన ఇస్మార్ట్ శంకర్ వీరికి లాభాల పంట పండించింది. వరల్డ్ వైడ్ గా 75కోట్లకు పైగా గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చిత్రంతో పాటు, పూరి కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ మూవీని కూడా నిర్మిస్తున్నారు. దీనికి అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తుండగా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఏక కాలంలో రెండు సినిమాలు నిర్మిస్తూ ఛార్మి చాలా ఒత్తిడి ఫీలవుతున్నట్లు తెలుస్తుంది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus