వరుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు తమిళ హీరో ఆర్య.ఆ చిత్రంతో ఏర్పడ్డ క్రేజ్ కారణంగా ఆయన చేసిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అందులో కొన్ని ఇక్కడ కూడా మంచి విజయాలను నమోదుచేశాయి. ఇటీవలే టెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్య.. సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాకు శక్తి సుందర్ రాజన్ దర్శకత్వం వహించారు. ఆర్య భార్య సాయేషానే ఇందులో హీరోయిన్.
వీళ్లది ప్రేమ వివాహం.అయితే ఆర్య ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి ఫైనల్ గా మోసం చేశాడు అంటూ ఓ హీరోయిన్ ఇతని పై చీటింగ్ కేసు పెట్టింది. అంతేకాదు ఆర్య ఈమె దగ్గర.. రూ.70 లక్షలు తీసుకున్నాడని చెప్పుకొచ్చింది. జెర్మనీలో నివసిస్తున్న శ్రీలంకకు చెందిన ఓ అమ్మాయి ఆర్యపై కేసు పెట్టిడం గమనార్హం. పీఎం, సీఎం, హోం మినిష్టర్ కార్యాలయాలకు ఈమె లేఖ కూడా రాయడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఈ నేపథ్యంలో ఆర్య పి.ఎ మహమ్మద్ అర్మన్ ఆర్య కోసమై ముందస్తు బెయిల్ కోరుతూ.. మద్రాసు హైకోర్టుకి రిక్వెస్ట్ పెట్టాడు.ఇది తెలుసుకున్న ఆ అమ్మాయి.. ఆర్యకు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కోరుతూ.. మరో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఏప్రిల్ 4న ఈ కేసుకు సబంధించి తదుపరి విచారణ జరగనుంది.