యూత్ స్టార్ నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి. ఆనందప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’. ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 26న(నిన్న) విడుదలైన ఈ చిత్రానికి…మొదటి షో నుండే డీసెంట్ అనే టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్లు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ..
భారీగా అయితే నమోదు కాలేదు. వాటి వివరాలను ఓసారి పరిశీలిస్తే :
నైజాం | 1.46 cr |
సీడెడ్ | 0.47 cr |
ఉత్తరాంధ్ర | 0.34 cr |
ఈస్ట్ | 0.14 cr |
వెస్ట్ | 0.10 cr |
గుంటూరు | 0.58 cr |
కృష్ణా | 0.21 cr |
నెల్లూరు | 0.09 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.39 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.10 cr |
ఓవర్సీస్ | 0.10 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.59 cr |
‘చెక్’ చిత్రానికి రూ.16.10కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు రూ.16.60 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. మొదటి రోజు ఈ చిత్రం 3.59 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 13.01 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. గతేడాది నితిన్ నుండీ వచ్చిన ‘భీష్మ’ ఫిబ్రవరిలోనే విడుదలైనప్పటికీ మొదటిరోజు 6కోట్ల పైనే షేర్ ను రాబట్టింది. అయితే ‘చెక్’ మాత్రం ఆ స్థాయిలో ఓపెనింగ్స్ ను నమోదు చెయ్యలేకపోయింది. శని,ఆది వారాలు గట్టిగా రాబడితే తప్ప ‘చెక్’ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి.
Click Here To Read Movie Review
Most Recommended Video
చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!