Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

‘క’ సినిమాతో రూ.50 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇక ‘బేబీ’ సినిమాతో ఆల్మోస్ట్ రూ.100 కోట్ల క్లబ్ కి దగ్గరగా వెళ్లారు నిర్మాత ఎస్ కె ఎన్, దర్శకుడు సాయి రాజేష్. ఈ ముగ్గురి కలయికలో ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా.. అది బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకం ఆడియన్స్ కి ఏర్పడటం సహజం. అందుకే ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) పై మొదటి నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Chennai Love Story

మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయని కూడా చెప్పొచ్చు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ కూడా సినిమాపై హైప్ పెంచింది. దీంతో ఫుల్ కాన్ఫిడెంట్ గా ప్రీమియర్ షోలు వేశారు. కానీ వాటికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ మొదటి నుండీ నెలకొన్న హైప్ కారణంగా .. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 1.29 cr
సీడెడ్ 0.40 cr
ఉత్తరాంధ్ర 0.35 cr
ఈస్ట్ 0.12 cr
వెస్ట్ 0.10 cr
గుంటూరు 0.30 cr
కృష్ణా 0.36 cr
నెల్లూరు 0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.02 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.18 cr
 ఓవర్సీస్ 0.95 cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 4.18 cr (షేర్)

‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.15.4 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం.. ప్రీమియర్ షోలతో కలుపుకుని రూ.4.18 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.7.98 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.11.82 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

 

 

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus