Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు క‌నెక్ట్ అయ్యే చిత్రం ‘చి.ల‌.సౌ’ – చైతన్య అక్కినేని

యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు క‌నెక్ట్ అయ్యే చిత్రం ‘చి.ల‌.సౌ’ – చైతన్య అక్కినేని

  • July 31, 2018 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు క‌నెక్ట్ అయ్యే చిత్రం ‘చి.ల‌.సౌ’ – చైతన్య అక్కినేని

సుశాంత్‌, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘చి||ల||సౌ’. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…

చైతన్య అక్కినేని మాట్లాడుతూ – ”7-8 నెలలు క్రితం సమంతో నాతో.. ‘రాహుల్‌ నిన్ను, నన్ను కలిసి ఓ స్క్రిప్ట్‌ చెబుతాడట’ అంది. నేను రాహుల్‌ నటించబోయే సినిమా అనుకున్నాను. కానీ తను దర్శకత్వం చేస్తున్నాడని తెలిసి కాస్త సర్‌ప్రైజ్‌ అయ్యాను. కథ వినగానే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఓ రాత్రిలో జరిగే కథ ఇది. ఇలాంటి కథ ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అవుతుందా? అనే సందేహం ఉండేది. సమంత నీది, రాహుల్‌ది సెన్సిబిలిటీస్‌ ఒకేలా ఉంటాయి. నువ్వు తనతో ఓ సినిమా చెయ్‌ అంది. సినిమా చూసిన తర్వాత తనతో సినిమా చేయడం సంగతి పక్కన పెడితే.. ఎలాగైనా ఈ సినిమాలో భాగం అయితే బావుండు అనిపించి నాన్నగారితో చెప్పాను. నాన్నగారు సినిమా చూశారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. సినిమాలో సుశాంత్‌ చాలా కొత్తగా కనపడతాడు. రుహని చాలా బాగా నటించింది. సుకుమార్‌గారి కెమెరా వర్క్‌, ప్రశాంత్‌ విహారి సంగీతం అన్ని ఎలిమెంట్స్‌ చక్కగా కుదిరాయి. సినిమాలో చాలా రియల్‌ మూమెంట్స్‌ ఉన్నాయి. యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు సినిమా చక్కగా కనెక్ట్‌ అవుతుంది” అన్నారు.

Chi La Sow

సమంత అక్కినేని మాట్లాడుతూ – ”11 ఏళ్లుగా నేను, రాహుల్‌ మంచి మిత్రులం. నా కెరీర్‌ బిగినింగ్‌ నుండి ఈ స్టేజ్‌ వరకు రాహుల్‌ నాకు సపోర్ట్‌ అందిస్తూ వచ్చాడు. తనకు మంచి భవిష్యత్‌ ఉండాలని నేను ఆ దేవుడ్ని చాలా సార్లు ప్రార్థించాను కూడా. తను మంచి హార్డ్‌వర్కర్‌. ఈ సినిమాను తను చూడమనగానే.. భయపడుతూ చూశాను. ఎందుకంటే.. నా స్నేహితుడు యాక్టింగ్‌ను దాటి డైరెక్టర్‌ కావాలనుకుని ఆశగా చేసిన సినిమా. చూసిన తర్వాత ఏం చెప్పాల్సి వస్తుందోనని అనుకున్నాను. సినిమా చూస్తున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రాహుల్‌ యాక్టర్‌గా నాకు కనెక్ట్‌ కాలేదు కానీ.. డైరెక్టర్‌గా కనెక్ట్‌ అయ్యాడు. కొత్త సుశాంత్‌ని తెరపై చూస్తారు. ఈ సినిమాలో రాహుల్‌పై నమ్మకంతో సుశాంత్‌ నటించాడు. ఆ కాన్ఫిడెన్స్‌ స్క్రీన్‌పై కనపడుతుంది. రుహని ఫైర్‌ క్రాకర్‌గా పేరు తెచ్చుకుంటుంది. తనకు అవార్డ్స్‌ కూడా వస్తాయి. అందరూ ఎగ్జయిట్‌మెంట్‌గా వెయిట్‌ చేస్తున్నాం” అన్నారు.

Chi La Sow

రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ – ”పెళ్లిచూపుల్లోని అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు కరెక్టా? కాదా? అని ఓ అరగంటలో ఎలా నిర్ణయించుకుంటారు. దానికి ఎంత సమయం పడుతుంది? అనే కాన్సెప్ట్‌తో సాగే చిత్రమిది. పెళ్లే వద్దు అనుకునే అర్జున్‌, అంజలి జీవితం ఓ రాత్రిలో ఎలాంటి మలుపులు తిరిగాయనేది సినిమా కథాంశం. నన్ను, సుశాంత్‌ను నమ్మి సినిమాను ప్రొడ్యూస్‌ చేసిన నిర్మాతలు జస్వంత్‌, భరత్‌గారికి.. సినిమాను విడుదల చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థకు థాంక్స్‌” అన్నారు.

Chi La Sow

చిన్మయి మాట్లాడుతూ – ”రాహుల్‌ పర్‌ఫెక్షనిస్ట్‌. ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పడానికి చాలా కష్టపడ్డాను. నీ సినిమాలకు ఇంకోసారి డబ్బింగ్‌ చెప్పను అని కూడా చెప్పేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవుతుంది” అన్నారు.

Chi La Sow

సుశాంత్‌ మాట్లాడుతూ – ”నేను ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో ఎక్కువగా నా ఓన్‌ డిషిషన్స్‌ను తీసుకోలేకపోయేవాడిని. వాటి రిజల్ట్స్‌ను పక్కన పెట్టేసి.. నేను స్వంత నిర్ణయంతో ఓ సినిమా చేద్దామని అనుకుంటున్న తరుణంలో రాహుల్‌ రవీంద్రన్‌ ఈ కథతో నన్ను కలిశాడు. ముందు వేరే కథ చెప్పాడు. అంత పూర్తయిన తర్వాత లైటర్‌ వెయిట్‌ ఉండే కథతో సినిమా చేద్దామని అనుకుంటున్నానని అన్నాను. నాలుగు రోజుల తర్వాత తను ఈ కథను నాకు చెప్పాడు. ఇలాంటి కథతో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. ఆడియెన్స్‌ హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకం ఉంది. కథను, మమ్మల్ని నమ్మి సినిమా చేసిన నిర్మాతలకు థాంక్స్‌” అన్నారు.

Chi La Sow

రుహనీ శర్మ మాట్లాడుతూ – ”సినిమాను విడుదల చేస్తున్న అక్కినేని ఫ్యామిలీకి థాంక్స్‌. నా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి నన్ను సెలక్ట్‌ చేసుకున్నారని చెప్పారు. కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా థాంక్స్‌. ఆగస్ట్‌ 3న విడుదలవుతున్న మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Chi La Sow

నిర్మాత జస్వంత్‌ కుమార్‌ నడిపల్లి మాట్లాడుతూ – ”డైరెక్టర్‌ అవుదామని అనుకున్న నేను నిర్మాతగా మారాను. రాహుల్‌ చెప్పిన కథ విని.. అందరికీ కనెక్ట్‌ అవుతుందనిపిచండంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. మంచి సినిమా చేశామనే నమ్మకం ఉంది. మా సినిమాను చూసి నమ్మకంతో విడుదల చేస్తున్నందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌, చైతన్యగారికి థాంక్స్‌” అన్నారు.

Chi La Sow

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chi La Sow
  • #Chi La Sow Movie
  • #Chi La Sow Movie Press Meet
  • #naga chaitanya
  • #Sushanth

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

trending news

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

16 mins ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

18 mins ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

3 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

6 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

9 hours ago

latest news

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

15 mins ago
Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

1 hour ago
Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

21 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

21 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version