చీకటి గదిలో చితక్కొట్టుడు

  • March 21, 2019 / 11:59 AM IST

తమిళంలో హిట్టయిన “ఇరుట్టూ అరైయిల్ మురట్టు కుత్తు” అనే అడల్ట్ కామెడీ హారర్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం “చీకటి గదిలో చితక్కొట్టుడు”. అరుణ్ ఆదిత్, మిర్చి హేమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగులో హోలీ సందర్భంగా నేడు (మార్చి 21) విడుదలైంది. మరి తమిళ యూత్ ఆడియన్స్ ను మెప్పించిన ఈ సబ్జెక్ట్ తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించగలదో చూద్దాం..!!

కథ: పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని కోరుకున్న చందు (అరుణ్ అదిత్) చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేసిన తర్వాత చిట్ట చివరికి తనకు కావల్సిన లక్షణాలు, షేపులు ఉన్న అమ్మాయి పూజ (నిక్కి తంబోలా) అని ఫిక్స్ అవుతాడు. పెళ్ళికి ముందు ఆమెతో కలిసి కొన్నాళ్లు టైమ్ స్పెండ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో తన స్నేహితుడు శివ (మిర్చి హేమంత్) మరియు అతని గర్ల్ ఫ్రెండ్ కావ్య (భాగ్యశ్రీ మోటే)తో కలిసి బ్యాంకాక్ కి వెళ్తాడు. అక్కడ తనకు తెలిసిన ఫ్రెండ్ బంగ్లాలో ఉంటారు. మొదట్లో అంతా బాగానే ఉంటుంది కానీ.. కొన్ని రోజుల్లోనే వాళ్ళ లైఫ్ ఒక ఆడ దెయ్యం (శాయంతని గుహతకుర్త) కారణంగా డిస్టర్బ్ అవ్వడం మొదలవుతుంది.

అసలు ఆ ఆడ దెయ్యం ఎవరు? ఆ బంగ్లాలో ఎందుకు ఉంది? చందు-శివ ని ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది? ఆమె తీరని కోరిక ఏమిటి? ఆ కోరికను చందు ఎలా తీర్చాడు? అనేది “చీకటి గదిలో చితక్కొట్టుడు” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

నటీనటుల పనితీరు: అరుణ్ ఆదిత్ పాత్రకు చాలా మంది ప్రెజంట్ జనరేషన్ యూత్ కనెక్ట్ అవ్వడం ఖాయం. ప్రెజంట్ జనరేషన్ కుర్రాళ్ళు అమ్మాయిలు, ప్రేమ విషయంలో ఎలా ఉంటున్నారు, వాళ్ళ ప్రియారిటీస్ ఎలా ఉంటున్నాయ్ అనేది బాగా చూపించారు. యూత్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన చిత్రం కావడంతో మాగ్జిమమ్ బోల్డ్ గానే చెప్పారు అంతా. ఇక ఆల్మోస్ట్ సెకండ్ హీరో లాంటి మిర్చి హేమంత్ తన పాత్రను సరైన రీతిలో రక్తికట్టించలేకపోయాడనే చెప్పాలి. అడల్ట్ కామెడీ సినిమాకి టైమింగ్ తోపాటు ఎక్స్ ప్రెషన్స్ కూడా చాలా అవసరం. ఈ రెండు విషయాల్లోనూ హేమంత్ తేలిపోయాడు.

నిక్కి తంబోలా, భాగ్యశ్రీ మోటేలు నటన అనే విషయాన్ని పక్కన పడేసి.. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ అందాలను వెండితెరపై ఆరబోశారు. అమ్మాయిల ఎక్స్ పోజింగులను ఆనందించేవారికి ఈ సినిమా ఓ విందు భోజనం లాంటిది. ఈ ఇద్దరూ సరిపోరన్నట్లు దెయ్యం పాత్రలో శాయంతని కూడా శృంగార రసాన్ని లీటర్ల కొద్దీ పొంగించింది. రఘుబాబు, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, పోసాని మురళీకృష్ణలు కామెడీ అక్కడక్కడా నవ్వించింది.

సాంకేతికవర్గం పనితీరు: తమిళ వెర్షన్ సినిమాని తెరకెక్కించిన సంతోష్ తెలుగు వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేయడంతో ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ లా చేశాడు. కంపేర్ చేసుకుంటే మహా అయితే.. తెలుగు వెర్షన్ లో హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ లెవల్ ఇంకాస్త పెరిగింది, డబుల్ మీనింగ్ & బూతు డైలాగులు కాస్త ఎక్కువయ్యాయి తప్పితే పెద్దగా ఛేంజస్ అయితే కనిపించలేదు. ఎలాగూ యూత్ కి మాత్రమే అని ముందు నుంచీ చెబుతూ వచ్చాడు కాబట్టి ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లకపోవడమే బెటర్. వెళ్లారంటే మాత్రం ఇబ్బందిపడతారు ముందే చెప్తున్నా.

రొటీన్ కథకి, రొమాన్స్ యాడ్ చేసి అడల్ట్ హారర్ కామెడీగా మార్చాడు దర్శకుడు సంతోష్. దాంతో కథలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వకపోయినా.. హీరోయిన్ల ఎక్స్ పోజింగ్, హీరోల డబుల్ మీనింగ్ బూతు డైలాగులు, కొన్ని శృంగార సన్నివేశాలు చూసి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేస్తారు.

విశ్లేషణ: “ఈరోజుల్లో, బస్టాప్” తరహా చిత్రాలను ఎంజాయ్ చేసిన యూత్ “చీకటి గదిలో చితక్కొట్టుడు” చిత్రాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే.. ఈ సినిమాలో వల్గారిటీ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం దూరంగా ఉండండి.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus