తొమ్మిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీతో అభిమానులకు మంచి విందు అందించారు. ఈ మూవీ వేగంగా వందకోట్ల క్లబులో చేరి చిత్ర బృందానికి, మెగా ఫ్యాన్స్ కి ఆనందాన్ని పంచింది. ఈ సంతోష సమయంలో చిరంజీవి తన తర్వాతి ప్రాజక్టులను ఖరారు చేశారు. 151 మూవీని సురేందర్ రెడ్డి డైరక్ట్ చేయనున్నారు. చెర్రీ కి ధృవ హిట్ ఇచ్చిన సూరి టేకింగ్ బాగుండడంతో మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మించనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక చిరు 152 మూవీకి డైరక్టర్ ఒకే అయిపోయారు.
మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బోయపాటి శ్రీను మెగాస్టార్ కి యాక్షన్ కథను సిద్ధం చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. అంతేకాదు ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలనీ చిరు అనుకుంటున్నారు. కాబట్టి మెగా అభిమానులకు ఈ ఏడాది సినిమాల రూపంలో మరో రెండు పండుగలు రానున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.