Chiranjeevi: ‘భోళా శంకర్‌’లో చిరంజీవి ఉండరట… మొత్తం ఆయనే కనిపిస్తాడట!

  • August 7, 2023 / 12:12 PM IST

‘భోళా శంకర్‌’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ను చిరంజీవి ఇమిటేట్‌ చేశారనే విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్‌ అయిన ప్రచార చిత్రాల్లో ఆ రిఫరెన్స్‌ కూడా ఉంది. అయితే ఇప్పుడు చిరంజీవి మాటలు వింటుంటే.. ఈ సినిమాలో చిరంజీవి చాలా తక్కువగా కనిపిస్తారు అని అంటున్నారు. ఈ మేరకు చిరంజీవి మాటల్లో చిన్నగా క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. ‘భోళా శంకర్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి అలాంటి కామెంట్స్‌ కొన్ని చేశాడు.

‘‘భోళా శంకర్‌’ సినిమాలో నేనెక్కడా కనిపించను. తమ్ముడు పవన్‌ కల్యాణే కనిపిస్తాడు. ఆ సీన్స్‌ ప్రేక్షకులకు కనులవిందుగా ఉంటాయి’’ అని చిరంజీవి చెప్పాడు. దీంతో కొత్త చిరును చూస్తాం అని కొంతమంది అంటుంటే.. ఈ సినిమా ఏమైనా చిరు మ్యాజిక్‌ మిస్‌ అవుతామా అనేవాళ్లూ ఉన్నారు. అయితే పవన్‌ మేనరిజమ్స్‌, చిరు స్టైల్‌లో అదిరిపోతాయి అని అంటున్నారు. అయితే ఇదంతా ‘ఖుషి’ సినిమాలో నడుము సీన్‌ రీక్రియేషన్‌ గురించే అని చెప్పకనే చెప్పేశారు చిరంజీవి.

శ్రీముఖి – చిరంజీవి (Chiranjeevi) మధ్య భూమిక – పవన్‌ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సీన్‌ రీక్రియేషన్‌ ఉంటుంది అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొన్ని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి స్పీచ్‌తో క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. దీంతో ఈ సినిమాలో ప్రేక్షకులు ఎదురుచూసే సీన్స్‌లో ఇది కూడా చేరింది అని చెప్పాలి. ఈ సినిమాలో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో అజత్‌ నవ్వే సీన్‌ను చిరంజీవి ఎలా చేసుంటారు అనే ఉత్సుకత ఉంది. ఇప్పుడు దానికి ‘ఖుషి’ రీమిక్స్‌ కూడా యాడ్‌ అయ్యింది.

ఇక ఈ సినిమా గురించి చూస్తే… మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర ఈ సినిమాను నిర్మించారు. చిరు సరసన తమన్నా నటించగా… కీర్తి సురేశ్‌, సుశాంత్‌ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఆ రోజు చిరు మ్యాజిక్‌ను థియేటర్లలో చూడొచ్చు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus