Chiranjeevi-Bobby: చిరు- బాబీల సినిమా సంక్రాంతికి కష్టమేనా?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. లు తమ అప్ కమింగ్ మూవీస్ విడుదల విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది. 2023 సంక్రాంతి బరిలోనే తమ సినిమాలను దింపాలని అటు బాలయ్య ఇటు చిరంజీవి ప్రయత్నిస్తున్నట్టు కథనాలు పుట్టుకొస్తున్నాయి. సంక్రాంతికి 4 పెద్ద సినిమాలను తట్టుకునే కెపాసిటీ బాక్సాఫీస్ కు ఉంది. చిరు, బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి!కాకపోతే ఇక్కడ సమస్యల్లా ఈ రెండు సినిమాలను నిర్మిస్తుంది ‘మైత్రి’ సంస్థే కావడం.

ఏ నిర్మాణ సంస్థ అయినా తమ సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయాలి అని అనుకోరు. అప్పుడు థియేటర్ల సమస్య వస్తుంది.అలాగే తమ సినిమా కలెక్షన్లను తామే చెడగొట్టినట్లు అవుతుంది. బాలయ్యకి తన సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేసినా అభ్యంతరం లేదు అని తెలిపినట్టు వినికిడి. ఎందుకంటే ‘అఖండ’ అదే టైంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అలాగే సోలో రిలీజ్ దొరికే అవకాశం ఉంటుంది. అయితే చిరు సినిమాని మాత్రం సంక్రాంతికే విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. చిరంజీవి – బాబీ కాంబినేషన్లో రూపొందిన సినిమా షూటింగ్ అప్పటికి కంప్లీట్ అయ్యే అవకాశాలు లేవట. కాబట్టి బాలయ్య- గోపీచంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమానే 2023 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలా అయితే ప్రభాస్ ‘ఆదిపురుష్’, విజయ్ ‘వారసుడు’ మరియు వైష్ణవ్ తేజ్ సినిమాలతో బాలయ్య సినిమా పోటీపడే అవకాశం ఉంటుంది. బాలయ్య సినిమా ఫైనల్ అయ్యింది కానీ మిగిలిన సినిమాలు రిలీజ్ అనేది అప్పుడే చెప్పలేం. ఇప్పటికైతే అనౌన్స్మెంట్ ఇచ్చారు అంతే..!

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus