Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

ఈటీవీ 30 వసంతాల వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు అనే విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. చిరంజీవి రామోజీ ఫిలింసిటీకి రావడం, ఈవెంట్‌ బయట ఆయన కనిపించిన వీడియోలు మీరూ చూసే ఉంటారు. ఇప్పుడు వాటన్నింటికి బాప్‌ లాంటి వీడియో ఒకటి లీక్‌ అయింది. దీంతో మెగాస్టార్‌ ఫ్యాన్స్‌ అయితే ఫుల్‌ ఖుష్‌ ఉన్నారు. ఎందుకంటే ఆ వీడియోలో చిరంజీవి గ్రేస్‌ భలేగా కనిపిస్తోంది.

Chiranjeevi

గ్రేస్‌కి చిరంజీవి కేరాఫ్‌ అడ్రెస్‌ అని చెప్పొచ్చు. డ్యాన్సుల్లో ఆయన తీసుకొచ్చిన ఆ ఎక్స్‌ట్రా ఎలిమెంటే ఆయనను ఇప్పుడు ఆ స్థాయిలో కూర్చొబెట్టి. 69 ఏళ్ల వయసులో చిరు డ్యాన్స్‌ వేస్తుంటే ఒక్కోసారి కుర్ర హీరోలు కూడా వెనుకబడతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డ్యాన్స్‌లో ఆయన స్పెషల్‌ ఎలిమెంట్‌ ఉంటుంది. దానికిగాను చిరంజీవికి గిన్నిస్‌ రికార్డు కూడా వచ్చింది. ఆ విషయం పక్కనపెట్టి లేటెస్ట్‌ వైరల్‌ వీడియో గురించి చూస్తే.. ఈటీవీ 30 వసంతాల వేడుక స్టేజీ మీద చిరంజీవి చిన్నగా రెండు, మూడు స్టెప్పులేశారు.

ఆ ఈవెంట్‌కి సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ క్రమంలో స్టేజీ మీద చిరంజీవిని పిలిచినప్పుడు ఆయన పాటలు ప్లే చేస్తే ఓ రెండు స్టెప్పులేశారు. ఒంట్లో స్ప్రింగ్‌లు ఉన్నట్లే భలేగా బాడీని ఊపుతూ స్టెప్పులేశాడు చిరు. ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలోని ‘చామంతి పువ్వా..’ పాటకు తనదైన స్టైల్‌లో తల ఆడిస్తూ, నడుమును ఊపుతూ, గ్రేస్‌ మూమెంట్‌లు వేశాడు. వీడియోలో ఆ రెండు స్టెప్పులే కనిపించినా ఈవెంట్‌లో ‘ఘరానా మొగుడు’ సినిమాలో పాటకు కూడా స్టెప్పులేశారని టాక్‌.

చిరు డ్యాన్స్‌ వేసే సమయంలో సీనియర్‌ నటి ఖుష్బూ, యువ కథానాయిక ఫరియా అబ్దులా, యాంకర్‌ – నటుడు నందు ఉన్నారు. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్‌ అయితే బాస్‌ ఏజ్‌ పెరిగే కొద్దీ గ్రేస్‌ పెరుగుతోంది అని ఆనందపడుతున్నారు.

హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus