Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » డైరెక్టర్స్ డే తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది: మెగాస్టార్ చిరంజీవి

డైరెక్టర్స్ డే తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది: మెగాస్టార్ చిరంజీవి

  • May 6, 2019 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్టర్స్ డే తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది: మెగాస్టార్ చిరంజీవి

దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని డైరెక్టర్స్‌డే పేరుతో గత ఏడాది నుంచి దర్శకుల సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా దాసరి జయంతి సందర్భంగా శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ హీరో చిరంజీవి టిఎఫ్‌డిఏ.ఇన్ పేరుతో ఏర్పాటు చేసిన వెబ్ సైట్‌ని ప్రారంభించారు. అనంతరం గత ఏడాది విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న తొలి చిత్ర దర్శకులను సత్కరించి జ్ఞాపికల్పి అందజేశారు. నీది నాది ఒకే కథ చిత్రానికి గాను టి.కృష్ణ పురస్కారాన్ని దర్శకుడు వేణు ఊడుగుల అందుకోగా, కేరాఫ్ కంచరపాలెం చిత్రానికి గానూ కోడి రామకృష్ణ అవార్డును వెంకటేష్ మహా స్వీకరించారు. ఛలో చిత్రానికి గాను వెంకీ కుడుముల ఇ.వి.వి పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆర్‌ఎక్స్100 చిత్రానికి గానూ అజయ్ భూపతి విజయబాపినీడు పురస్కారాన్ని అందుకున్నారు.

  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

అవార్డుతో పాటు 25 వేల నూపాయల నగదు బహుమతిని వీరికి చిరంజీవి అందజేశారు. విశ్వదర్శనం చిత్రానికి గానూ జనార్థన మహర్షిని, ఆంగ్ల చిత్రాన్ని తెరకెక్కించినందుకు గానూ వీఎన్ ఆదిత్యలను ఇదే వేదికపై చిరంజీవి సత్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ దాసరి నారాయణరావు పుట్టిన రోజుని దర్శకుల దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా గొప్ప విషయం. ఓ దర్శకుడికి ఇంతకంటే గొప్ప నివాళి వుండదు. ఇది తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 24 శాఖలపై మంచి పట్టుతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకులు దాసరి. నాటక రచయితగా, రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి. దాసరి లాంటి వ్యక్తి మరొకరు లేరు ఇక రారు. ఆయనతో కలిసి పని చేసింది ఒకే ఒక్క సినిమా లంకేశ్వరుడు. ఆయనతో నాకు అనుబంధం చాలా తక్కువ. రాఘవేంద్రరావుతో అత్యధికంగా చిత్రాలు చేశాను. దాసరితో ఎక్కువ చిత్రాలు ఎందుకు చేయలేకపోయానే అని బాధపడేవాడిని. ఆయన చాలా సందర్భాల్లో నన్ను మనవడిగా సంబోధించారు. అందరికి తెలియని విషయం ఒకటి వుంది. మా ఇద్దరికి చుట్టరికం వుంది. వరుసకు దాసరి, నేను తాతా మనవళ్లం అవుతాం. చివరి రోజుల్లో మా ఇద్దరి మధ్య బంధం బలపడింది. ఖైదీ నంబర్ 150 వేడుక విజయవాడలో జరిగినప్పుడు ఆయన అతిథిగా వచ్చి ఆశీర్వదించారు.

ఓ రోజు పాలకొల్లు నుంచి బొమ్మిడాయిలు తెప్పించానని ఇంటికి వచ్చి భోజనం చేయాలని ఫోన్ చేసి భోజనం పెట్టారు. అల్లు రామలింగయ్య అవార్డుని ఆయన ఇంటికి వెళ్లి నా చేతులతో అందించి వచ్చాను. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా గొప్ప దర్శకులున్నారు. వాళ్లలో దాసరి శైలి ప్రత్యేకం. ఎంత మంది గొప్ప దర్శకులున్నా దాసరిని మించిన దర్శకులు లేరు ఇక రారు అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి దర్శకుల సంఘం సహాయ నిధికి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అనంతరం దర్శకులు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ గతంలో ఓ వెలుగు వెలిగిన దర్శకులు ఇప్పుడు అవకాశాలు రాక, వయసు సహకరించక దయనీయ స్థితిలో వున్నారు. వారి ఆదుకోవడానికి నా తరపున 10 లక్షలు, బాహుబలి నిర్మాతలు ఇచ్చే 15 లక్షలు కలిపి 25 లక్షలు అందించబోతున్నాను. మిగతా సంఘాల సభ్యులకు పెన్షన్‌లు, హెల్త్ కార్డ్‌లు వున్నాయి కానీ దర్శకుల సంఘంలోని సభ్యులకు అలాంటివి లేవు. అందుకే 5 కోట్లతో దర్శకుల సహాయనిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.

దర్శకుడు రాజమౌళి తన వంతుగా స్పందించి 50 లక్షలు విరాళం ఇస్తానని ప్రకటించారు.ఈ నిధికి విరాళాలు అందించడానికి అగ్ర దర్శకులు చాలా మంది ముందుకొస్తున్నారు. వారే కాకుండా నటీనటులు కూడా వారికి తోచిన మొత్తాన్ని దర్శకులు సంఘం సహాయనిధికి అందజేయాలని కోరుతున్నాం అన్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్.శంకర్ మాట్లాడుతూ స్వర్గీయ దాసరి నారాయణరావు పుట్టిన రోజును డైరెక్టర్స్ డేగా జరుపుకోవడం ఆనందంగా వుంది. ఇలాంటి సమయంలో అందరం కలిసి మన ఆనందాన్ని పంచుకోవడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సైరా చిత్రీకరణ విదేశాల్లో జరుగుతున్నా.. కుటుంబం మొత్తం అక్కడే వున్న చిత్రీకరణకు చిన్న విరామం ఇచ్చి దర్శకుల సంఘం కుటుంబం కోసం అన్నయ్య చిరంజీవి ప్రత్యేక విమానంలో సొంత ఖర్చుతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక నుంచి కూడా దర్శకులు సంఘం నిర్వహించబోయే కార్యక్రమాలకు అన్నయ్య చిరంజీవి వెన్నుదన్నుగా నిలవాలని ఆశిస్తున్నాం. దర్శకుల సహాయ నిధికి విరాళాల ద్వారా ఒక్కరోజే కోటి రూపాయాలు సమకూరడం ఆనందంగా వుంది. మిగతా దర్శకులు కూడా సహకరిస్తే త్వరలోనే ఇది 5 కోట్లకు చేరుతుంది. ఈ విషయంపై త్వరలోనే అగ్ర దర్శకులం అంతా ప్రత్యేకంగా ఓ సమావేశాన్ని నిర్వహించుకోనున్నాం అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mega Star Chiranjeevi
  • #Sye raa

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

15 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

18 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

21 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

22 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

23 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version