Chiranjeevi: చిరు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆ సినిమా పైనే పెట్టారట..!

  • June 4, 2022 / 11:39 PM IST

‘సైరా’ ‘ఆచార్య’ చిత్రాలు చిరంజీవి జడ్జిమెంట్ కు సవాల్ విసిరాయి. పైగా సొంత ప్రొడక్షన్ లో చేసిన సినిమాలు కాబట్టి… నష్టాలు కూడా వచ్చాయి. ఆయన 4 దశాబ్దాల సినీ కెరీర్ ను ప్రశ్నించాయి ఆ సినిమాలు. దీంతో ఆయన తర్వాత చేయబోయే సినిమాల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన వాల్తేరు వీర‌య్య‌, గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్‌.. వంటి చిత్రాలను లైన్లో పెట్టారు. ఈ మూడు సినిమాలకి ఇప్పటివరకు సమాంతరంగా కాల్షీట్లు కేటాయిస్తూ వచ్చారు చిరు.

అయితే ఇప్పుడు ఆయన రూటు మార్చబోతున్నట్టు తెలుస్తుంది.మిగిలిన సినిమాలను పక్కన పెట్టేసి.. ముందుగా `వాల్తేరు వీర‌య్య‌` పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది పూర్తయ్యాక మిగిలిన సినిమాలు కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. వాల్తేరు వీర‌య్య‌… పక్కా మాస్ మూవీ. చిరు శైలికి తగ్గ సినిమా. మాస్ గా ఆడియన్స్ లో చిరుకి మంచి పట్టు ఉంది.అందులోనూ ఇది స్ట్ర‌యిట్ మూవీ. గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్ అయితే రీమేక్ చిత్రాలు.

‘గాడ్ ఫాదర్’ అయితే ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన మూవీ.ఇక భోళా శంకర్ అనేది ‘వేదాలం’ రీమేక్. ఇలాంటి కథతోనే తెలుగులో ‘వాంటెడ్’ ‘ఊసరవెల్లి’ ‘శౌర్యం’ వంటి సినిమాలు వచ్చాయి. కాబ‌ట్టి.. ఈ సినిమాలు ఎంత బాగా వచ్చినా.. రీమేకులతో పోలికలు ఉంటాయి. ‘వాల్తేరు వీర‌య్య’ స్ట్ర‌యిట్ మూవీ కాబట్టి ఎటువంటి నెగిటివ్ కామెంట్లు ఉండవు. అన్నీ అనుకున్నట్టు అయితే దసరాకే ఈ చిత్రం కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వినికిడి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus