మెగాస్టార్ కూడా అస్సలు తగ్గేదే లేదంటున్నాడా?

  • June 17, 2020 / 06:15 PM IST

రాజకీయాల్లో అయితే.. ఒకరి పై ఒకరు తమ ప్రత్యర్థుల పై సెటైర్లు వేసుకోవడం కామన్. అయితే వారు ఏదైనా వేడుకలకు హాజరైతే మాత్రం ఎలాంటి విభేదాలు చూపించకుండా కలిసి ఉన్నట్టు నటిస్తుంటారు. అయితే ‘సినీ ఇండస్ట్రీలో అలాంటిది ఉండదు. అందరూ కలిసే ఉంటారు’ అని హీరోలు చెబుతుంటారు. కానీ ‘అదంతా ఉత్తుత్తే.. పైకి అలా చెప్తారు కానీ, లోపల తెగ తిట్టుకుంటూ ఉంటారు’ అని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గతంలో ఓసారి చెప్పాడు. ఇప్పుడు చిరు- బాలయ్య వ్యవహారం చూస్తుంటే.. కొంచెం అలాగే అనిపిస్తుంది.

‘ఇండస్ట్రీ పై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు’ అంటూ చిరు పై ఇండైరెక్ట్ గా సెటైర్ వేసాడు బాలయ్య. అక్కడితో ఆగలేదు.. బాలయ్య పుట్టినరోజున చిరు.. బర్త్ డే విషెస్ చెబితే.. ‘నేను ఊహించని వాళ్ళు కూడా నాకు విషెస్ చెప్పారు. నన్ను ఇండస్ట్రీ మీటింగ్ లకు పిలవాల్సిన అవసరం ఉంది. మర్యాద ఇచ్చి .. పుచ్చుకోవాలి’ అంటూ బాలయ్య మళ్ళీ చిరు పై సెటైర్ లు వేసాడు. దాంతో చిరు ఇగో హర్ట్ అయినట్టు తెలుస్తుంది. ‘మంచిగా ఉండాలని ప్రయత్నించినా ఇలాంటి కౌంటర్లు ఏంటి? ‘ అని అతని సన్నహితుల దగ్గర మెగాస్టార్ ఓపెన్ అయ్యారని సమాచారం.

అంతేకాదు బాలయ్యకు కౌంటర్ ఇవ్వాలని కూడా చిరు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. తను కొరటాల మూవీ టీజర్ ద్వారా.. ‘నా క్యారెక్టర్ ను జడ్జ్ చెయ్యడానికి నువ్వెవడివి’ అంటూ సాగే డైలాగ్ తో చిరు.. బాలయ్య పై సెటైర్ వెయ్యబోతున్నట్టు సమాచారం. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీనుతో కూడా చిరు దర్శకుడు కొరటాల శివ కు మనస్పర్థలు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే చిరు డైలాగ్ లో స్ట్రాంగ్ పంచ్ ఉండబోతుందని తెలుస్తుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus