Chiru – Kamal: రజనీకాంత్ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్
- November 2, 2026 / 09:07 AM ISTByFilmy Focus Desk
‘మెగా వర్స్’ పేరుతో చిరంజీవి ఓ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ త్వరలో స్ట్రీమ్ అవ్వనున్న ఈ షో గురించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. కావాలని బయటకు లీక్ ఇస్తున్నారో లేక అవే లీక్ అవుతున్నాయో కానీ.. ఇప్పటివరకు షూట్ చేసిన రెండు ఎపిసోడ్ల గెస్టుల పేర్లు బయటకు వచ్చేశాయి. అయితే ఇప్పటివరకు ఎవరెవరు గెస్టులు వచ్చారు అనే వివరాలు బయటకు రాగా.. తొలిసారి ఎపిసోడ్‌లో ఏం మాట్లాడారు అనేది తెలిసింది.
Chiru – Kamal
అవును, ఇటీవల చిత్రీకరించిన కమల్ హాసన్ ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికరమైన చర్చ జరిగిందట. చాలా ఏళ్ల తర్వాత మీరు, రజనీకాంత్ కలసి ఓ సినిమా చేస్తున్నారు కదా అని అడిగితే.. మీరు కూడా నాతో ఓ సినిమా చేయాలి అని చిరంజీవిని కమల్ హాసన్ అడిగారట. అయితే అది ‘ఎవరు హీరో?’ అనే ప్రశ్న రాకుండా కమల్ నిర్మాతగా.. చిరంజీవి హీరోగా ఆ సినిమా వచ్చేలా.. అంటే ‘ధర్మన్’ తరహాలో రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో చిరంజీవి హీరోగా ఆ సినిమా ఉంటుంది అన్నమాట.
ఈ ప్రతిపాదనకు చిరంజీవి కూడా ఓకే చెప్పారట. దీంతో ఆ సినిమాకు ఎవరు దర్శకులు అని కోలీవుడ్‌లో ఓ చర్చ నడుస్తోంది. అయితే, చిరంజీవి సినిమా చేస్తానని మాట ఇవ్వడం ఓకే.. ఆయనను మెప్పించే కథ ఎవరు సిద్ధం చేయగలరు అనేదే ప్రశ్న. ‘ధర్మన్’ సినిమాకే ఇద్దరు దర్శకులు మారి అశ్వత్ మరిముత్తు కెప్టెన్ అయ్యారు. మరిప్పుడు చిరంజీవి కథ ఒప్పించడం పెద్ద పనే. దానికి తోడు గతంలో చిరంజీవి.. ఇలానే రాధిక శరత్ కుమార్‌కి సినిమా చేస్తా అన్నారు. ఇంకా చేయలేదు.
ఆ విషయం పక్కన పెడితే.. ‘మెగావర్స్’కి సంబంధించిన రీసెంట్‌గా బ్రహ్మానందం – సునీల్ – సత్య మీద ఓ ఎపిసోడ్ తెరకెక్కించారట. కమల్ సంగతి పైనే చదివారు. ఈ రెండింటిలో ఏది తొలుత స్ట్రీమ్ చేస్తారు అనేది చూడాలి.
















