Chiranjeevi: ‘విశ్వంభర’ నుండి వరుస అప్‌డేట్‌లు.. చిరును అలా చూసి..

Ad not loaded.

టీజర్‌తో సినిమాకు హైప్‌ రావడం చూసుంటారు. సినిమా గురించి గొప్పగా మాట్లాడటం చూసుంటారు. కానీ సినిమాకు ఉన్న హైప్‌, ఆసక్తి మొత్తం చచ్చిపోయిన సినిమా చూశారా? ఇలాంటి ఎవరూ వద్దనుకున్న రికార్డు రెస్పాన్స్‌ అందుకున్న సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో ఒకటి ‘ఆదిపురుష్‌’ (Adipurush) అయితే, మరొకటి ‘విశ్వంభర’ (Vishwambhara) . ‘బింబిసార’ (Bimbisara) సినిమాతో భారీ విజయం అందుకుని ఆ ఊపులో చిరంజీవితో (Chiranjeevi)  సినిమా చేసి వావ్‌ అనిపించారు. కానీ టీజర్‌ వచ్చాక మొత్తం పరిస్థతి మారిపోయింది.

Chiranjeevi

సంక్రాంతి కానుగా ‘విశ్వంభర’ సినిమాను తీసుకొస్తాం అంటూ ప్రారంభించిన తొలి రోజుల్లోనే చెప్పిన టీమ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) కోసం ఆగిపోయింది. ఆ సినిమా వచ్చినా విజయం సాధించలేదు. అటు టీజర్‌కు నెగిటివ్‌ రెస్పాన్స్‌, ఇటు వాయిదాలు పడటంతో సినిమా మీద హైప్‌ తగ్గింది. మరోవైపు టీమ్‌ కూడా సినిమా అప్‌డేట్స్‌ ఇవ్వడం మానేసింది. దీంతో ‘విశ్వంభర’ ఏమైంది అనే చర్చ మొలైంది. అయితే టీమ్‌ ఇప్పుడు ఒక్కసారిగా రీయాక్టివేట్‌ అయింది.

‘విశ్వంభర’కు సంబంధించి రెండు పెద్ద అప్‌డేట్‌లు బయటకు వచ్చాయి. చిరంజీవి వైబ్రంట్‌, ఫ్రెష్‌ లుక్‌ కూడా బయటకు వచ్చింది. అది చూసి బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఇంట్రో సాంగ్‌ను ప్రస్తుతం టీమ్‌ సిటీలో తెరకెక్కిస్తోంది. దాని లుక్‌నే టీమ్‌ రిలీజ్‌ చేసింది. దీంతో ఆ నెగిటివిటీ కూడా పోవాలి అని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

విజువల్‌ ఎఫెక్స్ట్‌ విషయంలో ‘విశ్వంభర’ ఇబ్బంది పడుతోంది. నాసికరం వర్క్‌తో టీజర్‌ రిలీజ్‌ చేశారు అనే విమర్శలు వచ్చాయి. హాలీవుడ్‌ సినిమాల సీన్స్‌ను ఎత్తేశారు అనే విమర్శలు కూడా వచ్చాయి. మరిప్పుడు లుక్‌తో తిరిగి ట్రాక్‌లోకి వస్తున్న సినిమాను ఇదే ఊపులో పూర్తి చేసి రిలీజ్‌ చేయాలి. లేదంటే సినిమాను జనాలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. అన్నట్లు సినిమా రిలీజ్‌ డేట్‌ అయితే ఇంకా చెప్పలేదు.

సూర్య న్యూ కాంబో.. 300 ఏళ్ళు వెనక్కి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus