Suriya: సూర్య న్యూ కాంబో.. 300 ఏళ్ళు వెనక్కి?

సూర్య  (Suriya)  కొత్త సినిమాలకు సంబంధించి ఒకటి కాకుండా రెండు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెట్రిమారన్ (Vetrimaaran), కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) వంటి టాప్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తున్నా, మరోవైపు అతను ఓ స్ట్రాంగ్ పీరియాడికల్ స్టోరీపై కూడా ఫోకస్ పెట్టాడని తాజా టాక్. హిట్ డైరెక్టర్ చందూ మొండేటితో  (Chandoo Mondeti) కలిసి 300 ఏళ్ల క్రితం నాటి కథ ఆధారంగా ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయడానికి సూర్య సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చందూ మొండేటి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాధమిక పనులు పూర్తిచేశారని, కథ కూడా సూర్యకు వినిపించారని తెలిసింది.

Suriya

Suriya With Telugu director pan india movie

అయితే సూర్య నుండి ఇంకా అధికారిక గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఈ కథలో వాస్తవికత, కథనశైలి, భారీ సెటప్ కలిసొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లాలంటే, ప్రస్తుతం సూర్య చేతిలో ఉన్న కంగువా, వడివాసల్ పూర్తవ్వాలి. చందూ మొండేటి పాన్ ఇండియా మార్కెట్‌ను బాగా అర్థం చేసుకుని కథలు చెప్పే దర్శకుల్లో ఒకరు.

కార్తికేయ 2 (Karthikeya 2) సినిమా నేషనల్ లెవెల్లో భారీ విజయం సాధించాక, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది. మొదట నాగ చైతన్యతో(Naga Chaitanya)  తండేల్  (Thandel)  సినిమాను అనౌన్స్ చేసి, సక్సెస్ అందుకున్న తర్వాతే సూర్య ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చందూ తను రూపొందించే కథలు, హిస్టారికల్, మిస్టరీ అంశాలతో మేళవించేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సూర్య తన పాన్ ఇండియా ప్రయోగాల్ని మెల్లగా ఫిల్టర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కంగువా ఆశించిన రీతిలో క్లిక్ కాకపోవడంతో, తన తదుపరి స్క్రిప్ట్స్‌పై మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడట. అందుకే, చందూ మొండేటి చెప్పిన కథను చాలా ఇంట్రెస్టింగ్‌గా ఫీలయినా, తుది నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే, ఇది మరోసారి టాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్లలో హైప్ క్రియేట్ చేసే ప్రాజెక్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు, గీతా ఆర్ట్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించనున్నట్లు టాక్ ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus