Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

‘ఆయన కేవలం సినిమాలు మాత్రమే చేస్తున్నారు.. ఇంకో రంగంలో రాణించలేరు’ అంటూ కొంతమంది గత కొన్నేళ్లుగా చిరంజీవి గురించి ఇదే మాట అంటూనే ఉన్నారు. అయితే ఆయన లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తారు అనే విషయం తెలిసి ఉన్న అభిమానులు మాత్రం ‘కాస్త వెయిట్‌ చేయండమ్మా.. బాస్ వస్తాడు’ అనేవారు. లేటెస్ట్‌ ఫ్యాన్స్‌ అయితే ఈ విషయంలో కాస్త కంగారు పడ్డారు. ఇప్పుడు చిరంజీవి కోటరీ నుండి వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే.. సీనియర్‌ ఫ్యాన్స్‌ చెప్పినట్లుగానే జరుగుతోంది.

Chiranjeevi

అందులో ఒకటి.. ఓటీటీ. ఇప్పటికే ‘అన్‌స్టాపబుల్‌’ షోతో నందమూరి బాలకృష్ణ, ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌తో వెంకటేశ్‌ ఓటీటీలోకి అడుగుపెట్టేశారు. ‘బిగ్‌బాస్‌’ అన్‌స్టాపబుల్‌ ఓటీటీ షో ద్వారా నాగార్జున వచ్చేశారు. దీంతో చిరంజీవి ఒక్కరే పెండింగ్‌. ఇప్పుడు ఆయనతో ఓ టాక్‌ షోని నిర్వహించేందుకు ఓ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ రెడీ అవుతోంది. ఈ మేరకు రిహార్సిల్స్‌ కూడా జరిగిపోయాయి అని చెబుతున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

ఇక చిరంజీవి నిర్మించబోతున్న రెండు థియేటర్లకు సంబంధించిన వార్తలు ఈ మధ్య తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకటి ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌. ఏషియన్ సినిమాస్‌, చిరంజీవితో కలసి హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అతి పెద్ద స్క్రీన్‌తో మల్టీప్లెక్స్‌ నిర్మించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ జర్మనీలోని ట్రాంపాలాస్ట్‌ లియోన్‌బర్గ్‌‌లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్క్రీన్ తీసుకొస్తున్నారు.

ఈ స్క్రీన్‌ వెడల్పు 128 అడుగుల కంటే ఎక్కువగా, పొడవు 102 అడుగులు కంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ లెక్కన సీటింగ్‌ లెక్క తేలాల్సి ఉంది. అలాగే ఈ భారీ స్క్రీన్ ఐమాక్స్ ఫార్మాట్లోనే ఉండబోతోంది అని చెప్పొచ్చు. మూడేళ్లలో ఈ స్క్రీన్ అందుబాటులోకి వస్తుందని ప్రాథమిక సమాచారం. అయితే దీనిపై రెండు వర్గాల నుండి పక్కా సమాచారం రావాల్సి ఉంది. అన్నట్లు మరో సింగిల్‌ థియేటర్‌ను తీసుకొని రీమోడల్‌ చేసి ఈ ఏడాది ఆఖరులో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారట. ఈ లెక్కన చిరంజీవి నాన్‌ సినిమాలో బిజీ అవుతున్నారు..

నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus