భోళా శంకర్ : మెహర్ మంచి పనే చేసాడు..!

  • December 17, 2021 / 09:33 PM IST

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ను పూర్తి చేయడమే కాకుండా వరుసగా మరో మూడు సినిమాల షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, బాబీ దర్శకత్వంలో ఓ మూవీ. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ సినిమాని అనౌన్స్ చేశారు. మరి అది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. ఇదిలా ఉండగా… మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న ‘భోళా శంకర్’ మూవీ చిరంజీవికి 154వ సినిమా.

ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ చిత్రాన్ని నిజానికి పవన్ కళ్యాణ్ రీమేక్ చెయ్యాలి అనుకున్నారు.. కానీ కుదరక 5 ఏళ్ళ తర్వాత చిరు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అందులో హీరో అజిత్ ఆలుమ డోలుమ అనే పాత్ర ఉంటుంది. ఈ పాత్ర గుండు లుక్ తో కనిపిస్తుంది. దాంతో రీమేక్ కోసం చిరు కూడా ఈ లుక్ ను ట్రై చెయ్యాలి అనుకున్నారు.

అందుకోసం లుక్ టెస్ట్ లో కూడా పాల్గొన్నారు. కానీ దానికి మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో చిరు ఆలోచిద్దాం అని లైట్ తీసుకున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం.. మెహర్ ఆ గుండు లుక్ ను లైట్ తీసుకున్నారట. చిరంజీవి గడ్డంతో చాలా బాగుంటారు కాబట్టి.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను అలా కానిచ్చేద్దాం అని డిసైడ్ అయ్యారట. మెహర్ నిర్ణయం సరైనదే అని చిరు కూడా మెచ్చుకున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా, చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ‘క్రియేటివ్ కమర్షియల్స్’ అధినేత కె.ఎస్.రామారావుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus