Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » తప్పకుండా కౌసల్య కృష్ణమూర్తి మంచి విజయం సాధిస్తుంది: చిరంజీవి

తప్పకుండా కౌసల్య కృష్ణమూర్తి మంచి విజయం సాధిస్తుంది: చిరంజీవి

  • June 18, 2019 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తప్పకుండా కౌసల్య కృష్ణమూర్తి మంచి విజయం సాధిస్తుంది: చిరంజీవి

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌’. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌తోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్రం టీజర్‌ను జూన్‌ 18న మెగాస్టార్‌ చిరంజీవి రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా..

i-am-eagerly-waiting-for-kausalya-krishnamurthy-megastar-chiranjeevi-1

మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ – ”క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మా కె.ఎస్‌. రామారావుగారి నిర్మాణ సారథ్యంలో మిత్రుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రికెట్‌ నేపథ్యంలో వస్తోన్న విబిన్న కథాంశమిది. స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మూవీస్‌కి ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు. నేషనల్‌ వైడ్‌గా స్పోర్ట్స్‌ నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా ఘన విజయం సాధించింది . గేమ్స్‌కి అంతటి ప్రాధాన్యత ఉంది. ఇండియాలో క్రికెట్‌ అనేది ఒకరకంగా చెప్పాలంటే నేషనల్‌ గేమ్‌లాంటిది. దాని బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. ఇందులో హీరోయిన్‌గా చేసిన ఐశ్యర్యా రాజేష్‌… సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఒక ఉమెన్‌ క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. క్రికెటర్‌ క్యారెక్టర్‌ ని జస్టిఫై చేయడానికి నాలుగైదు నెలల పాటు శిక్షణ తీసుకొని ఆ తర్వాత షూటింగ్‌ చేయడం ప్రారంభించింది అంటే ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్‌, శ్రద్ధాసక్తులు, పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఐశ్వర్యా రాజేష్‌ ఎవరో కాదు.. మా కొలీగ్‌ రాజేష్‌ కూతురు.

  • గేమ్ ఓవర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వజ్ర కవచధర గోవింద సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అలాగే కమెడియన్‌ శ్రీలక్ష్మీ మేనకోడలు. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్‌ రావడం అన్నది శుభపరిణామం. నేను ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. స్వాగతం పలుకుతున్నాను. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎలాంటి ప్రోత్సాహం లేని వాతావరణం నుండి వచ్చి తనకు తానుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ అంతర్జాతీయ స్థాయికి వెళ్లి, ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించి, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేవిధంగా క్లైమాక్స్‌ ఉంటుంది అని చెప్పారు. నాకు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవుతుంది. మంచి విజయవంతమైన సినిమాలకు పెట్టింది పేరైన క్రియేటివ్‌ కమర్షియల్స్‌కి ఇది మరో విజయం అవుతుంది. అలాగే కమర్షియల్‌తో పాటు మంచి ఇతివృత్తాలను తీసుకునే తెరకెక్కించే భీమనేని శ్రీనివాసరావుకి ఇది ఒక మైలుస్టోన్‌ మూవీగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ప్రతి ఒక్క యూనిట్‌ సభ్యునికి హృదయపూర్వక శుభాకాంక్షలు” అన్నారు.

i-am-eagerly-waiting-for-kausalya-krishnamurthy-megastar-chiranjeevi-2

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ – ”ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్‌ చిరంజీవిగారు రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో ఆయనకు ఉన్న అనుబంధం మీ అందరికీ తెల్సిందే. ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్‌మెంట్‌ చాలా అవసరం. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చినా, స్క్రీన్‌ప్లే పరంగా, సబ్జెక్ట్‌ పరంగా కానీ ఇది విభిన్నమైనది. తమిళ్‌లో శివ కార్తికేయన్‌గారి ఓన్‌ ప్రొడక్షన్‌లో వచ్చి అక్కడ చాలా పెద్ద హిట్‌ అయింది. తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.

i-am-eagerly-waiting-for-kausalya-krishnamurthy-megastar-chiranjeevi-3

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అధినేత కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ – ”40 సంవత్సరాలుగా మెగాస్టార్‌కి, మా సంస్థకి ఉన్న అనుబంధం గురించి మీ అందరికీ తెల్సిందే. రేపు మీరు చూడబోయే ఒక గొప్ప సినిమా అయిన మా ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్‌ను లాంచ్‌ చేసిన మెగాస్టార్‌ చిరంజీవిగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సినిమా గురించి నేను ప్రత్యేకంగా, గర్వంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. ‘కౌసల్య కృష్ణమూర్తి’ ఇప్పుడున్న యూత్‌కి కనెక్ట్‌ అయ్యే సినిమా. ఎనర్జిటిక్‌గా ఉంటూనే మంచి ఎమోషనల్‌గా ఉండే ఒక రైతు కుటుంబానికి సంబంధించిన కథ. ప్యారలల్‌గా ఒక క్రికెటర్‌, రైతు కథ. ఈ సినిమా ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో రేపు సినిమా రిలీజయ్యాక తెలుస్తుంది. ఒకటి మాత్రం చెప్పగలను..ఈ సంవత్సరం రాబోయే గొప్ప సినిమాల్లో ఖచ్చితంగా ‘కౌసల్య కృష్ణమూర్తి’ ఒకటి. ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతూ ఈ కథకు కారణమైన అరుణ్‌రాజ కామరాజ్‌ గారికి, ప్రత్యేకంగా మా హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌,నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, ప్రత్యేక పాత్ర చేసిన శివ కార్తికేయన్, హీరో కార్తీక్‌ రాజు లకు నా ధన్యవాదాలు” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Bhimaneni Srinivasa Rao
  • #Dhibu Ninan Thomas
  • #Kousalya Krishnamurthy Cricketer
  • #Rajendra Prasad

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version