Chiranjeevi: మొగల్తూరు ఇంటి వివాదం గురించి అసలు నిజాలు బయటపెట్టిన చిరంజీవి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఇతరుల సహాయం లేకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా రాణిస్తూ స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి ఒక మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ పదిలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే చిరంజీవి మెగాస్టార్ గుర్తింపు పొందినప్పటికీ అతని గురించి అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. సాధారణంగా ఏ రంగంలో అయినా ఒకరు ఎదుగుతుంటే వారు ఎదుగుదలను అడ్డుకోవటానికి కొంతమంది అనేక విధాలుగా ప్రయత్నిస్తూ లేనివి ఉన్నట్లు సృష్టిస్తూ ఉంటారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి 2009 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో మొగల్తూరులో ఉన్న ఆయన ఇంటిని గ్రంథాలయం కోసం అడిగితే కేవలం మూడు లక్షల ఆశపడి గ్రంథాలయానికి ఇవ్వవలసి వస్తుందని అప్పటికప్పుడు ఇల్లు అమ్ముకున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు చిరు రాజకీయ జీవితంపై చాలా ప్రభావం చూపాయి.

ఇక తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో మొగల్తూరు ఇంటి వివాదం గురించి యాంకర్ ప్రశ్నించగా చిరంజీవి స్పందిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ విషయంపై చిరంజీవి మాట్లాడుతూ..” అసలు మొగల్తూరులో ఉన్న ఇల్లు తనది కాదని. అది తన మేనమామదని స్పష్టం చేశాడు. ఆ ఇంట్లోనే తన తల్లి తనకి జన్మనిచ్చిందని, ఆ తర్వాత కొంతకాలం తాను అక్కడే ఉండి చదువుకున్నానని తెలియజేశాడు.

ఇక ఆ ఇల్లు తన తండ్రి సంపాదించిన ఆస్తి కాదని, నా మేనమామ ఆస్తిని దానమిచ్చే హక్కు ఎలా ఉంటుందంటూ చిరు చెప్పుకొచ్చాడు. ఇక ఆ ఇంటి గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఈ వార్తలు రాక ముందే నేను అక్కడ లైబ్రరీ కట్టించాను అంటూ మొగల్తూరు ఇంటి వివాదం గురించి అసలు నిజాలు బయటపెట్టాడు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus