Chiranjeevi: వాళ్లను దేవుళ్లతో సమానంగా పూజిస్తున్న చిరంజీవి.. చాలా గ్రేట్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్న చిరంజీవి తనలా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలనుకున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్మిన చిరంజీవి తన ప్రతిభతో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. చిరంజీవి చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. భోళా శంకర్ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో పాటు ఈ సినిమాకు 30 కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా రాలేదు.

ఈ సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చినా చిరంజీవి మార్కెట్ మాత్రం కొంచెం కూడా చెక్కు చెదరలేదు. కళ్యాణ్ కృష్ణ, వశిష్ట సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు తనపై విమర్శలు చేసిన వాళ్లకు ఒకింత గట్టిగానే సమాధానం చెబుతానని చిరంజీవి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చిరంజీవి తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి కుటుంబంలో రాఖీ పండుగ గ్రాండ్ గా జరగగా ఆయన ఇద్దరు చెల్లెళ్లు చిరంజీవికి రాఖీ కట్టారు.

అయితే చిరంజీవి ఇంట్లోని పూజగదిలో దేవుళ్ల ఫోటోలతో పాటు ఇద్దరు వ్యక్తుల ఫోటోలు ఉన్నాయి. తనకు జన్మనిచ్చిన తండ్రి కొణిదెల వెంకట్రావు ఫోటోను, నటుడిగా తన సక్సెస్ కు కారణమైన అల్లు రామలింగయ్య ఫోటోను చిరంజీవి పూజ గదిలో ఉంచుకున్నారు. తన ఎదుగుదలకు కారణమైన వాళ్లను చిరంజీవి అస్సలు మరిచిపోరని చిరంజీవి గొప్పదనానికి ఇంతకు మించి సాక్ష్యం కావాలా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తండ్రి, మామను దేవుళ్లతో సమానంగా పూజిస్తున్న చిరంజీవి గొప్ప మనస్సుకు ఫిదా అవుతున్నామని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. చిరంజీవికి కెరీర్ పరంగా వచ్చే సంవత్సరం కలిసిరావడంతో పాటు భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus