మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ ప్రీ రిలీజ్ వేడుక సూపర్ సక్సస్ అయింది. వేలాదిగా అభిమానులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వేదికపై చిరంజీవి ప్రసంగం ఎంతో ఉద్వేగంతో సాగి ఆకట్టుకోగా, మెగా బ్రదర్ నాగబాబు ఆవేశంగా మాట్లాడి వివాదాలకు తెరలేపారు. డైరక్టర్ వర్మను ఇండైరెక్ట్ గా విమర్శించారు. అక్కుపక్షి అంటూ దూషించారు. ఆయన మాటలను వర్మ సరదాగా తీసుకున్నప్పటికీ తర్వాత ఎదురుదాడికి దిగారు. ట్విట్టర్ వేదికగా ఆపకుండా నాగబాబును విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య గొడవ ఇంకా కొనసాగుతోంది. దీనిపై మెగాస్టార్ ఈ రోజు స్పందించారు.
“వర్మ తో నాకు మంచి స్నేహం ఉంది. అందుకే అతను నా గురించి, నా చిత్రాల గురించి చేసే వ్యాఖ్యలను పట్టించుకోను. నాగబాబు మాత్రం ఆ వ్యాఖ్యలకు బాధపడి మాట్లాడాడు.” అంటూ వివరించారు. అయితే నాగబాబు వ్యాఖ్యలపై మాట్లాడేందుకు చిరు ఆసక్తి చూపించలేదు. అలాగే పవన్ కళ్యాణ్ ‘ఖైదీ నెంబర్ 150’ ప్రీ రిలీజ్ వేడుకకు ఎందుకు రాలేదో కూడా చెప్పారు. రామ్ చరణ్ వ్యక్తిగతంగా పవన్ ను ఆహ్వానించాడని.. తనకు పని ఉండటం వల్ల రాలేకపోతున్నానని పవన్ చెప్పాడని చిరు వివరించారు. ఇలా వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.