మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే భోళా శంకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గత కొద్ది రోజుల క్రితం చిరు లీక్స్ లో భాగంగా మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యింది. అందులో చిరు కోపంగా ఈ సినిమాలో తన చెల్లి పాత్రలో నటించిన కీర్తిసురేష్ పీక పట్టుకుంటారు. అది సినిమాలో సన్నివేశం కాదు… కానీ సెట్లో నిజంగానే జరిగిందని తెలిపారు.
ఈ విధంగా చిరంజీవి (Chiranjeevi) ఎప్పుడూ కూడా తోటి నటీనటుల పట్ల చాలా సరదాగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఇలా కోపం ప్రదర్శించారు కానీ సెట్లో ఏకంగా కీర్తి సురేష్ పీక పట్టుకోవడంతో ఇలా ఎందుకు ఆయన రియాక్ట్ అయ్యారన్న విషయం గురించి పెద్ద ఎత్తున అభిమానులలో సందేహం ఏర్పడింది అయితే ఈ ప్రశ్నకు చిరంజీవి తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సమాధానం తెలియజేశారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా కీర్తి సురేష్ తన ఇంటి నుంచి వచ్చే భోజనాన్ని తినేవారని చిరంజీవి తెలిపారు. తన ఇంట్లో తమిళ వంట మనిషి కీర్తి సురేష్ కి ఏమేమి కావాలో అన్ని చక్కగా వండి పంపించేది అయితే పప్పులో కాస్త ఉప్పు తగ్గిన కారం తగిన ఈమె దానిని వెనక్కి తిరిగి పంపించేదని చిరంజీవి తెలిపారు. ఒకరోజు తాను షూటింగ్లో ఉండగా కీర్తి సురేష్ తన వద్దకు వచ్చి రేపు మెనూ ఏంటి అని అడిగింది.
ఇలా రేపు మెనూ ఏంటి అని అడగడంతో సరదాగా తన పీక పట్టుకున్నారని అయితే దానిని కూడా షూట్ చేశారు అంటూ ఈ సందర్భంగా చిరంజీవి కీర్తి సురేష్ ను పీక పట్టుకోవడం గురించిచేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తమన్నా మాత్రం తన ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ అసలు తినేది కాదని,తనకోసం ప్రత్యేకంగా ఫుడ్ వచ్చేది అంటూ ఈ సందర్భంగా చిరంజీవి ఈ సినిమా షూటింగ్ లోకేషన్ లో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఈ సందర్భంగా తెలిపారు.