వరుణ్ తేజ్ కి తాను చెప్పిన మాటలను బయట పెట్టిన చిరంజీవి
- April 8, 2017 / 09:13 AM ISTByFilmy Focus
అపజయాలతో సతమవుతున్న డైరక్టర్ శ్రీనువైట్ల ఎంతో శ్రమించి చేసిన మూవీ మిస్టర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై మాట్లాడారు. వరుణ్ కి తాను మొదటి నుంచి కష్టాన్ని నమ్ముకో.. ఆదరించడానికి అభిమానులున్నారని సలహా ఇస్తుంటానని వెల్లడించారు. ఇంకా మాట్లాడుతూ.. “మేమంతా ఉన్నాము.. ఆ వెనుకాల అభిమానులంతా ఉన్నారు. మాకేంట్లే అనే భావంతో కాకుండా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలి. ప్రతి సినిమా ఫస్ట్ సినిమాలాగా కష్టపడి పనిచేయాలి. అప్పుడే ఈ అభిమానులను నిలబెట్టుకునే వాడవవుతావు. మాకు గర్వకారణం అవుతావు.” అని చెబుతుంటానని మెగాస్టార్ వివరించారు.
కామెడీ పండించగల ప్రతిభ గలిగిన డైరక్టర్ శ్రీనువైట్ల, అతని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూర్చిన పాటలు అన్నీ బాగున్నాయని అభినందించారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న మిస్టర్ ఏప్రిల్ 14న థియేటర్లోకి రానున్నాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












