Chiranjeevi: చిరు అమెరికా వెళ్లింది సర్జరీ కోసమా… అసలేం జరిగిందంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా భోళా శంకర్ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న అనంతరం తన భార్య సురేఖతో కలిసి అమెరికా వెకేషన్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. దాదాపు రెండు వారాలపాటు అమెరికా వెకేషన్ తర్వాత చిరు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇలా ఈయన హైదరాబాద్ చేరుకొని తన సినిమా భోళా శంకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ కానున్నారు.

ఇకపోతే అమెరికా పర్యటన ముగించుకొని వచ్చినటువంటి చిరు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన అమెరికా వెళ్ళినది వెకేషన్ కోసం కాదని సర్జరీ కోసం వెళ్లారు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చిరంజీవికి సర్జరీ జరిగిందనే విషయం తెలియడంతో అసలు ఏం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈయన కాలు కాస్త నొప్పి ఉండడంతో ఆ నొప్పి నుంచి విముక్తి పొందడం కోసమే అమెరికాలో చిన్న సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలుస్తోంది. ఇకపోతే చిరంజీవి సర్జరీ కోసమే అమెరికా వెళ్లలేదని సమాచారం. ఈయన తన భార్య సురేఖతో కలిసి అమెరికా వెకేషన్ వెళ్లారు పనిలో పనిగా సర్జరీ కూడా చేయించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

అయితే ఈయన ఆరోగ్య విషయంలో ఎవరు కంగారు పడాల్సిన పనిలేదని తన పరిస్థితి బాగుందని తెలుస్తుంది. ఇక హైదరాబాద్ చేరుకున్నటువంటి చిరంజీవి భోళా శంకర్ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ కానున్నారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానుంది.వాల్తేరు వీరయ్య వంటి సక్సెస్ సినిమా అని అందుకున్న తర్వాత చిరంజీవి (Chiranjeevi) ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus