గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై ‘కత్తిలాంటోడు’ చిత్రీకరణ..!
- June 22, 2016 / 11:26 AM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి నటించిననున్న చిరు 150 వ చిత్రం ‘కత్తిలాంటోడు’.. జులై 23 నుంచి చిత్రీకరణ జరుపుకోనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక జైల్ సెట్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుండగా.. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై కూడా ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కత్తి రీమేక్ గా రూపొందిస్తుండగా.. చిరు పొలిటికల్ కెరీర్ ను దృష్టిలో పెట్టుకొని.. సాయి మాధవ్ బుర్రా, పరుచూరి బ్రదర్స్, ఆకుల శివలు చిత్ర కథాంశంలో మార్పులు చేశారని అంటున్నారు. కాగా ఇటీవలే విడుదలైన ఒక్క అమ్మాయి తప్ప చిత్రం కూడా ఇదే ఫ్లైఓవర్ పై చిత్రీకరణ జరుపుకుంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















