‘వాల్తేరు వీరయ్య’ సెట్‌లో చిన్న పిల్లాడిలా మారిపోయిన చిరంజీవి.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా.. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన పక్కా మాస్ అండ్ ఎమోషనల్ ఫిలిం ‘వాల్తేరు వీరయ్య’.. మాస్ మహారాజా రవితేజతో కలిసి ప్రేక్షకాభిమానులను ఆకట్టుకోవడంతో పాటు బూజు పట్టిన బాక్సాఫీస్ దుమ్ము దులిపేశాడు బాస్.. కొద్ది కాలంగా చిరు నుండి ప్రేక్షకాభిమానులు మిస్ అవుతున్న కామెడీని ఈ చిత్రంలో చూపించి అలరించారాయన. తన స్టైల్ మేనరిజమ్స్, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ స్థాయిలో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ రూ. 230 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ స్పాట్‌లో తీసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి చిన్న పిల్లాడిలా ఓ పాపతో ముచ్చటిస్తూ చాక్లెట్స్ ఇస్తున్న పిక్స్ బాగున్నాయి. ఈ పిక్చర్స్‌లో మెగాస్టార్‌తో పాటు షకలక శంకర్, సప్తగిరి కూడా ఉన్నారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు చిరు..

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news