టాలీవుడ్ లో నందమూరి నట సింహం నట ప్రస్థానం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు…. కళకి…నటనకి జీవితాన్ని అంకితం చేసిన వంశం అది…అయితే అదే క్రమంలో నందమూరి నట సింహం బాలయ్య తన ప్రతిష్టాత్మక100వ చిత్రాన్ని శాతవాహనుల కధతో “గౌతామీ పుత్ర శాతకర్ణి”గా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే…అయితే అదే క్రమంలో ఈ సినిమా మొత్తం పూర్తి అయ్యింది, రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసేసారు….అదే క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలు పెట్టడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి…అయితే ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సంగీత దర్శకుడు చిరంతన్ భట్ మాట్లాడుతూ….కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు…అసలైతే ఈ సినిమా కి మ్యూజిక్ దర్శకుడిగా ముందు దేవి ను అనుకున్నారు….అయితే కొన్ని కారణాల వల్ల ఆయన్ని కాదని చిరంతన్ భట్ కు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే….అదే క్రమంలో ప్రమోషన్ లో భాగంగా చిరంతన్ ఏమంటున్నాడు అంటే… దేవిశ్రీ ప్రసాద్ ను ఈ చిత్రం నుంచి తప్పించారనే విషయం నాకు తెలీదు.
నేను నాసిక్ లో వుండగా దర్శకుడు క్రిష్ ఫోన్ చేసి.. బాలయ్య వందో చిత్రానికి సంగీతం అందించాలని కోరారు. దాంతో నేను సరే అన్నా. ఇక ఏ వివరాలు నేను అడగలేదని అన్నారు. అంటే కాదు….సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడుతూ…ఇది హిస్టారికల్ చిత్రం కాబట్టి… ఆనాటి ఫీల్ రావడానికి పాత ఇన్ స్ట్రూమెంట్స్ నే ఉపయోగించా అంటూ తెలిపారు…ఇక సినిమా ఎలా ఉంటుంది అంటే….మాత్రం…శాతకర్ణి సాధారణ చిత్రం అయితే కాదు. చరిత్రలో నిలిచిపోయే సినిమా. ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమించారు. ఇదో విజువల్ ఫీస్ట్, రచయిత బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగులకు హాల్లో విజిల్ వేయకుండా మాత్రం ఎవ్వరూ వుండలేరు. అంతటి పవర్ ఫుల్ డైలాగులు ఇందులో వున్నాయని సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాడు…మరి ఆ అంచనాలను బాలయ్య అందుకుంటాడో లేదో చూడాలి…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.