Chor Baazar Collections: సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘చోర్ బజార్’..!

Advertisement

ఆకాష్ పూరి హీరోగా గెహనా సిప్పీ హీరోయిన్ గా ‘దళం’ ‘జార్జ్ రెడ్డి’ వంటి చిత్రాలను అందించిన జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. ‘యూవీ క్రియేషన్స్’ సమర్పణలో ‘ఐవీ క్రియేషన్స్’ పతాకంపై వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడం తో మొదటి నుండీ సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ వేడుకలో బండ్ల గణేష్ స్పీచ్ కూడా ఈ చిత్రం పబ్లిసిటీకి కారణం అయ్యింది అనే చెప్పాలి.

జూన్ 24న విడుదల అయిన ఈ చిత్రానికి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది.దాంతో ‘చోర్ బజార్’ కి ఓ మోస్తారు ఓపెనింగ్స్ నమోదయ్యాయి.ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.18 cr
సీడెడ్ 0.08 cr
ఉత్తరాంధ్ర 0.06 cr
ఈస్ట్ 0.03 cr
వెస్ట్ 0.03 cr
గుంటూరు 0.06 cr
కృష్ణా 0.04 cr
నెల్లూరు 0.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.53 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.02 cr
ఓవర్సీస్ 0.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.57 cr

‘చోర్ బజార్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.76 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.0.57 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ పెద్దది కాబట్టి బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఎక్కువగా రాబట్టాల్సి ఉంది. రెండో రోజు బుకింగ్స్ డల్ గా ఉన్నాయి. మూడో రోజు ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus