యువతిని వేధిస్తున్న కారణంగా ఆ కొరియోగ్రాఫర్ అరెస్ట్..!

  • May 22, 2021 / 12:15 PM IST

తాజాగా ఓ కొరియోగ్రాఫర్‌ అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారింది.యువతిని వేధింపులకు గురిచేస్తున్న కారణంగా అతన్ని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారట. వివరాల్లోకి వెళితే… మణి ప్రకాశ్‌ అనే కొరియోగ్రాఫర్ షార్ట్ ఫిల్మ్‌లు తీస్తుంటాడు. గత ఏడాది ఇతను రూపొందించిన ఓ షార్ట్ ఫిల్మ్ లో ఓ అమ్మాయి నటించింది. ఆమె కూడా అతనితో బాగానే మాట్లాడేది. అయితే షూటింగ్ టైం లో ఆమెకు తెలియకుండా.. మణి ప్రకాష్ కొన్ని అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు తీసేవాడట.

అతని షార్ట్ ఫిలింలో నటిస్తుంది కాబట్టి.. ఆ అమ్మాయి కూడా మణి ప్రకాష్ తో సన్నిహితంగానే మాట్లాడేది. మణి ప్రకాష్ ఈమెకు ఫోన్లు కూడా చేసేవాడట. అయితే ఓసారి ఆ అమ్మాయికి, మణి ప్రకాష్ కు మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దాంతో ఆ అమ్మాయి పై కక్ష కట్టాడు ఈ కొరియోగ్రాఫర్.ఇన్‌స్టా గ్రామ్ లో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ అమ్మాయికి సంబంధించి చాటుగా తీసిన అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తాను అంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు.

అటు తరువాత వాటిని పోస్ట్ చేసాడని తెలుస్తుంది. దీంతో ఆ అమ్మాయి.. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే వారు రంగంలోకి దిగి కొరియోగ్రాఫర్ మణి ప్రకాశ్‌ను అరెస్ట్ చేసారని స్పష్టమవుతుంది. పలు సెక్షన్ల కింద అతని పై కేసు పెట్టి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus