హీరోగా మారుతున్న యంగ్ కొరియోగ్రాఫర్!

  • November 26, 2022 / 04:26 PM IST

ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లు హీరోలుగా మారడం చాలా సార్లు చూశాం. ప్రభుదేవా, లారెన్స్, అమ్మ రాజశేఖర్.. ఇలా చాలా మంది డాన్స్ మాస్టర్స్ హీరోలుగా మారారు. ఇప్పుడు జానీ మాస్టర్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ హీరోగా మారడానికి రెడీ అవుతున్నారు. అతడు మరెవరో కాదు.. యశ్వంత్ మాస్టర్. సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేయడమే కాకుండా..

బుల్లితెరపై పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంటారు యశ్వంత్. ఇప్పుడు ఆయనకు హీరోగా అవకాశం వచ్చింది. అది కూడా దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ బ్యానర్ లో కావడం విశేషం. శశి అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ.. ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదొక రాక్ స్టార్ స్టోరీ. సంగీతానికి, డాన్స్ కి ప్రాధాన్యం ఉన్న కథ. ఈ కథకు ఒక కొరియోగ్రాఫర్ అయితేనే న్యాయం చేయగలరని యశ్వంత్ మాస్టర్ ని హీరోగా ఎన్నుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానుంది. దిల్ రాజు తన బ్యానర్ లో అప్పుడప్పుడు చిన్న సినిమాలు తీస్తుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఒకే సినిమాతో హీరోని, డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus