నందమూరి హీరోలపై చోటా కె నాయుడు కామెంట్లు విన్నారా?

  • August 1, 2022 / 01:11 PM IST

టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన ఛోటా కె నాయుడుకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. హీరోలను అందంగా చూపించడంతో పాటు సినిమా రేంజ్ ను తన సినిమాటోగ్రఫీ ద్వారా పెంచే సినిమాటోగ్రాఫర్లలో చోటా కె నాయుడు ఒకరని చెప్పవచ్చు. ఈ తరహా జానర్ సినిమాలో తాను నటించడం ఇదే తొలిసారి అని చోటా కె నాయుడు చెప్పుకొచ్చారు. నందమూరి హీరోలు ఏది ఏమైనా చేసేద్దాం అని చెబుతారని అయన కామెంట్లు చేశారు.

బింబిసార సినిమాలో కొన్ని రిస్కీ సన్నివేశాలు ఉన్నాయని ఆ సీన్లలో కూడా కళ్యాణ్ రామ్ భయపడకుండా చేశాడని చోటా కె నాయుడు చెప్పుకొచ్చారు. గతంలోనే కళ్యాణ్ రామ్ తో పని చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల మిస్సైందని ఆయన తెలిపారు. బింబిసార బాహుబలి స్థాయి సినిమా కాదని అయితే గొప్ప సినిమా మాత్రం అవుతుందని చోటా అన్నారు. కొత్త దర్శకుడు అయినా షాట్ వృథా చేయకుండా వశిష్ట్ ఈ సినిమాను తెరకెక్కించారని చోటా తెలిపారు.

నందమూరి హీరోలు షూటింగ్ లొకేషన్ కు చెప్పిన టైమ్ కు వస్తారని అయితే హీరోలు త్వరగా వచ్చినా పని విషయంలో కంగారు పెట్టరని షాట్ రెడీ అని చెప్పేవరకు ఎంతో ఓపికతో ఉంటారని చోటా అన్నారు. కళ్యాణ్ రామ్ గత సినిమాలన్నీ ఒక రేంజ్ లో ఉంటే ఈ సినిమా మరో రేంజ్ లో ఉంటుందని చోటా కె నాయుడు చెప్పుకొచ్చారు. నందమూరి హీరోలు టైమింగ్ విషయంలో, కష్టపడే విషయంలో సేమ్ టు సేమ్ అని చోటా కె నాయుడు వెల్లడించారు.

బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ ఆశలు నెరవేరడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కథల ఎంపికలో కళ్యాణ్ రామ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వేగంగా సినిమాలు చేయడం కంటే నటించిన సినిమాలతో విజయాలను అందుకోవడంపై కళ్యాణ్ రామ్ దృష్టి పెడుతున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus