NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున
- August 29, 2026 / 07:54 PM ISTByPhani Kumar
2027 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద వెంకటేష్, చిరంజీవి తలబడనున్నారు. వీరి మధ్య పోటీ గట్టిగానే ఉండబోతోంది. ఈ 2 సినిమాలపై మంచి బజ్ ఉంది. అయితే సంక్రాంతికంటే ముందు బాలకృష్ణ, నాగార్జున మధ్య కూడా బాక్సాఫీస్ ఫైట్ జరగనుంది. నిజమే..! వివరాల్లోకి వెళితే.. 2026 క్రిస్మస్..కి బాక్సాఫీస్ 2 భారీ చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అందులో ఒకటి నాగార్జున ‘కింగ్ 100′(వర్కింగ్ టైటిల్) కాగా సినిమా కాగా మరొకటి ‘ఎన్ బి కె 111′(NBK111).
NBK111 X King100

‘కింగ్ 100′(King100) చిత్రాన్ని తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్నాడు. నాగార్జున కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ‘కింగ్ 100’ పై మంచి అంచనాలు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థపై అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టబు ఈ చిత్రంలో నాగార్జునకి జోడీగా కనిపించనున్నారు. ఈరోజు నాగార్జున పుట్టినరోజు కావడంతో ‘కింగ్ 100’ కి సంబంధించి ఒక గ్లింప్స్ వదిలారు.
చూడటానికి ఇది చాలా స్టైలిష్ గా ఉంది. ‘కూలీ’ లో నాగార్జున లుక్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కింగ్ 100’ కోసం కూడా ఆల్మోస్ట్ సేమ్ లుక్స్ ట్రై చేస్తున్నాడు నాగార్జున. మాస్ ఎలిమెంట్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయనే హోప్స్ ఇచ్చింది టీజర్. నాగార్జునకి డిసెంబర్ అనేది సెంటిమెంట్ సీజన్. అందులోనూ క్రిస్మస్ టైమ్లో వచ్చిన నాగార్జున సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఆ రకంగా కూడా ‘కింగ్ 100’ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది.
ఇదిలా ఉంటే.. బాలకృష్ణ- గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతోన్న ‘ఎన్ బి కె 111’ చిత్రాన్ని కూడా డిసెంబర్ 24కే రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీత దర్శకుడు. బాలయ్య- గోపీచంద్ మలినేని కలయికలో రూపొందిన గత చిత్రం ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ‘ఎన్ బి కె 111’పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
థియేటర్ వైబ్ కావాలా.. హిట్ ‘సింగిల్’తో తీసుకొచ్చేయ్..













