ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ అనేవి కామన్. ‘మా హీరో సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది అంటే.. కాదు మా హీరో సినిమానే ఎక్కువగా కలెక్ట్ చేసింది’ అంటూ ఫ్యాన్స్ కొట్టుకోవడం కామన్. ఒకప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్ల వద్ద జరిగే ఫ్యాన్ వార్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. ఇప్పుడు అవి కూడా డిజిటల్ అయ్యాయి. అంటే సోషల్ మీడియాకి షిఫ్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడ తమ హీరోల కోసం పోటీ హీరోలను ట్రోల్ చేసే పని పెట్టుకునే అభిమానులు బాగా ఎక్కువ.
ఇక్కడ హిట్లు, కలెక్షన్ల లెక్కల విషయాల్లోనే కాదు.. హీరోల పర్సనాలిటీలని సైతం టార్గెట్ చేసే బ్యాచ్ ఎక్కువ.ఈ ఫ్యాన్ వార్స్ లో హీరోల హైట్ టాపిక్ కూడా ఎక్కువగా వస్తుంటుంది. ఇందులో భాగంగా.. కొందరు పనిగట్టుకుని ఎన్టీఆర్(NTR) హైట్ ను విమర్శిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా స్టార్ సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ హైట్ గురించి చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, నందమూరి అభిమానులకి చిరాకు తెప్పిస్తున్నాయి.
రత్నవేలు మాట్లాడుతూ….” ‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్ హైట్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రత్యేకమైన కెమెరా యాంగిల్స్ ఫాలో కావాల్సి వచ్చింది. వైడ్ షాట్స్ తీసినప్పుడు హీరోలు ఉన్న హైట్ కంటే తక్కువగా(పొట్టిగా) కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువ హైట్ కనబడకుండా జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్తలన్నీ ‘దేవర’ కోసం తీసుకున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి ‘పెద్ది’ సినిమా గురించి ముచ్చటించుకుంటున్న క్రమంలో.. యాంకర్ చరణ్ హైట్ విషయంలో తీసుకున్న జాగ్రత్తల గురించి ప్రశ్నించాడు. ఆ టైమ్లో రత్నవేలు ‘దేవర’ టాపిక్ తీసుకొచ్చి మరీ ఎన్టీఆర్ హైట్ గురించి మాట్లాడటం జరిగింది. అంతే యాంటీ ఫ్యాన్స్ కి మంచి స్టఫ్ దొరికినట్టు అయ్యింది. అదీ మేటర్..!