Prabhas, Rajamouli: చత్రపతి విషయంలో ప్రభాస్ రాజమౌళి గొడవ గురించి తెలుసా?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా వచ్చింది అంటే ఆ సినిమా సక్సెస్ మొత్తం దర్శకుడు ఖాతాలోకి వెళ్తుంది. ఆ తరువాత హీరోల ఖాతాలోకి చేరుతుంది అంతలా సినిమా కోసం ఆయన కష్టపడతారు అంతేకాకుండా ఆ సినిమాని అదే స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో బాహుబలి సినిమా కంటే ముందుగానే చత్రపతి సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

2005వ సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా విషయంలో ప్రభాస్ రాజమౌళి ఇద్దరు కూడా భారీ స్థాయిలో గొడవపడ్డారని తాజాగా ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా చత్రపతి సినిమా క్రెడిట్ నీదంటే నీది అంటూ రాజమౌళి ప్రభాస్ ఇద్దరు కూడా గొడవ పడ్డారు. ప్రముఖ నిర్మాత బివిఎన్ ప్రసాద్ సమక్షంలోని ప్రభాస్ రాజమౌళి ఇద్దరు కూడా మాట్లాడుతూ

ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడానికి కారణం నువ్వే ప్రభాస్ అంటూ రాజమౌళి మాట్లాడగా లేదు ఈ సినిమా హిట్ అవ్వడానికి మీరే కారణం అని రాజమౌళి మాట్లాడారు. ఇలా వీరిద్దరు కూడా ఈ సినిమా హిట్ అవ్వడానికి నువ్వే కారణం అంటూ నువ్వే కారణం అంటూ మాట్లాడారు. అయితే ఈ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. చత్రపతి సినిమా సక్సెస్ ఎవరి క్రెడిట్ అని అడగడంతో అది నీ క్రెడిట్ అంటూ రాజమౌళి తండ్రి చెబుతారు

మరి ఆయన ఒప్పుకోవాలిగా అని అనడంతో ఎవరు అనగా హీరో ఒప్పుకోలేదు అంటూ మాట్లాడుతారు అనంతరం ప్రభాస్ తన స్నేహితుల వద్దకు వెళ్లి సీరియస్ అవ్వగా ఏమైంది అంటూ అడుగుతారు. చత్రపతి సినిమా సక్సెస్ క్రెడిట్ ఎవరిది అని అడగడంతో నీదే అంటారు మరి ఆయన ఒప్పుకోలేదు అనగా ఎవరు అంటే దర్శకుడు అంటూ ప్రభాస్ మాట్లాడతారు ఇలా వీరిద్దరూ ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ కోసం గొడవ పడుతున్నటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

 

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus