‘రావణాసుర’ తో పోటీగా ‘మీటర్’.. ఫలితం ఎలా ఉంటుందో..!

  • March 3, 2023 / 02:50 PM IST

రవితేజ నటించిన గత 3,4 సినిమాలకు పోటీగా కొంతమంది యంగ్ అండ్ సీనియర్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఖిలాడి’ చిత్రానికి సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ రిలీజ్ అయ్యింది. ‘ఖిలాడి’ ప్లాప్ అవ్వగా ‘డీజే టిల్లు’ సూపర్ సక్సెస్ సాధించింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ పక్కన ‘విక్రాంత్ రోణ’ రిలీజ్ అయ్యింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్లాప్ అవ్వగా.. ‘విక్రాంత్ రోణ’ బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇక ‘ధమాకా’ చిత్రానికి పోటీగా నిఖిల్ నటించిన ’18 పేజెస్’ రిలీజ్ అయ్యింది. అయితే ‘ధమాకా’ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఇప్పుడు రవితేజ సినిమాకి కిరణ్ అబ్బవరం సినిమా పోటీగా రిలీజ్ అవుతుంది. వివరాల్లోకి వెళితే…ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం త్వరలో మీటర్ అనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘క్లాప్ ఎంటర్టైన్మెంట్’ ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రమేష్ కాడూరి డైరెక్ట్ చేస్తున్నాడు.

 

ఏప్రిల్ 7న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ కిరణ్ అబ్బవరంకి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే అదే రోజున రవితేజ నటించిన ‘రావణాసుర’ కూడా రిలీజ్ కాబోతుంది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీని రవితేజ హోమ్ బ్యానర్ అయిన ‘ఆర్ టి టీం వర్క్స్’ బ్యానర్ తో కలిసి ‘అభిషేక్ పిక్చర్స్’ సంస్థ నిర్మిస్తుంది.

నిజానికి ‘రావణాసుర’ పైనే ప్రేక్షకుల దృష్టి ఉంది. ‘ధమాకా’ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో రవితేజ మంచి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి కిరణ్ అబ్బవరం సినిమా నిలబడటం కష్టమే..! ఒకవేళ ‘రావణాసుర’ టాక్ కొంచెం అటు ఇటు అయినా ‘మీటర్’ డామినేట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ‘మీటర్’ కి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి అండ కూడా అంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus