Color Photo Movie: కలర్ ఫోటో మూవీ వెనుక ఇంత కథ ఉందా?

  • August 1, 2022 / 08:04 AM IST

2020 సంవత్సరం అక్టోబర్ 23వ తేదీన ఆహా ఓటీటీలో విడుదలైన కలర్ ఫోటో సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా వల్ల ఆహా ఓటీటీ సబ్ స్క్రైబర్ల సంఖ్య సైతం ఊహించని స్థాయిలో పెరగడం గమనార్హం. ఈ సినిమాకు అవార్డ్ రావడంతో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రాజ్ ఈ సినిమాలో హీరోగా నటించిన సుహాస్ గురించి జోరుగా చర్చ జరిగింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాస్, సందీప్ రాజ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కలర్ ఫోటో మూవీ షూట్ సమయంలో ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అని చాలామంది అనుకున్నారని సుహాస్ చెప్పుకొచ్చారు. కలర్ ఫోటో మూవీలో సునీల్ హీరో పాత్రలో నటిస్తున్నాడని తాను అందరికీ చెప్పేవాడినని సుహాస్ కామెంట్లు చేశారు. నేను, హర్ష కలర్ ఫోటో మూవీలో క్యారెక్టర్స్ వేస్తున్నామని చెప్పేవాడినని సుహాస్ పేర్కొన్నారు.

నేను హీరో అని చెప్పడం ఎందుకని భావించి ఆ విధంగా చెప్పేవాడినని సుహాస్ చెప్పుకొచ్చారు. సందీప్ రాజ్ మాట్లాడుతూ కలర్ ఫోటో సినిమాకు చాందిని చౌదరిని హీరోయిన్ గా ఎంపిక చేసిన సమయంలో చాలామంది వద్దని చెప్పారని చాందిని చౌదరి గతంలో చేసిన సినిమాలు చూశావు కదా అని అన్నారని కామెంట్లు చేశారు. ఒక ప్రొడ్యూసర్ అయితే సుహాస్ హీరోగా వద్దని రాహుల్ రామకృష్ణతో సినిమా తీస్తే నేను బడ్జెట్ పెడతానని అన్నారని సందీప్ రాజ్ చెప్పుకొచ్చారు.

హీరోగా సుహాస్ ను ఎంపిక చేయడం అవసరమా అని కొంతమంది చీప్ లుక్ ఇచ్చారని సందీప్ రాజ్ తెలిపారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఉంటే బాగుండేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. కలర్ ఫోటో మూవీ సక్సెస్ తో అటు సుహాస్ కు ఇటు సందీప్ రాజ్ కు సినిమా ఆఫర్లు పెరిగాయనే సంగతి తెలిసిందే.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus