మగ బిడ్డకు జన్మనిచ్చిన రాహుల్ రామకృష్ణ భార్య.. సంతోషంలో కమెడియన్!

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కమెడియన్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. కొన్నిసార్లు కమెడియన్ పాత్రల ద్వారా కూడా సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్స్ ఉన్నారు.ఇలా కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాహుల్ రామకృష్ణ ఒకరు.

అర్జున్ రెడ్డి సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన జాతి రత్నాలు సినిమాతో మరింత ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అయినటువంటి రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదిక పలు కాంట్రవర్సీ పోస్టులు చేస్తూ వివాదాలకు కారణం అవుతూ ఉంటారు. ఇకపోతే గత ఏడాది ఈయన ఒక అమ్మాయికి లిప్ కిస్ ఇస్తూ తనకు కాబోయే భార్య అంటూ హరితను పరిచయం చేశారు.

ఇలా తనకు కాబోయే భార్యను పరిచయం చేసిన రాహుల్ రామకృష్ణ పెళ్లి గురించి ఎక్కడ ప్రస్తావించకపోయిన గత ఏడాది నవంబర్ నెలలో త్వరలోనే తాను తండ్రి కాబోతున్నాను అంటూ తన భార్య బేబీ బంప్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.అయితే ఈ ఫోటో చూసినటువంటి అభిమానులు రాహుల్ రామకృష్ణకు పెళ్లి ఎప్పుడు జరిగింది అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.

ఇక తండ్రి కాబోతున్నానంటూ గతంలో ఈయన పోస్ట్ చేయగా తాజాగా నేడు ఉదయం తన భార్య ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది అంటూ ఈయన తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే సినిమా స్టైల్ లో సంక్రాంతి రిలీజ్ అంటూ తనకు కొడుకు పుట్టిన విషయాన్ని అలాగే ఫోటో ఫేస్ కనపడకుండా ఉన్న తన కొడుకు ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus