Comedian Satya: సత్య సీరియల్లో కూడా నటించాడా.. వీడియో వైరల్.!

ఇటీవల ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) సినిమా రిలీజ్ అయ్యింది. రితేష్ రానా  (Ritesh Rana)  డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2019 లో వచ్చిన ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) కి సీక్వెల్. మొదటి షో నుండే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఎక్కువగా సినిమాలో హీరో కంటే కమెడియన్ సత్యనే (Satya)  హైలెట్ అయ్యాడు. హీరో కానీ, హీరోయిన్ కానీ, స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్, సీనియర్ కమెడియన్ సునీల్ … వీళ్లంతా సత్య నటన ముందు తేలిపోయారు అంటే అతిశయోక్తి అనిపించుకోదు.

Comedian Satya

సినిమాలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హైలెట్ గా నిలిచింది సత్యనే..! ‘మత్తు వదలరా 2’ రెండో వారంలో కూడా బాగా కలెక్ట్ చేస్తుండడంతో సత్య గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటుంది ఇండస్ట్రీ అంతా. ఇక సోషల్ మీడియాలో నెటిజెన్లు కూడా సత్యని సరిగ్గా పెద్ద సినిమాల్లో వదట్లేదు అని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. సత్య కెరీర్ గురించి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

అతని మొదటి సినిమా పిల్ల జమిందార్ అని, అలా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి సత్య.. అమృతం సీరియల్ లో కూడా నటించాడు. ఆ సీరియల్ 2007 టైంకి అయ్యింది. అంటే సత్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యిందన్న మాట. ఆ సీరియల్లో సత్యకి సంబంధించిన క్లిప్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. అందులో సత్య చాలా సన్నగా ఉన్నాడు. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘వేట్టయాన్‌’ గురించి ఆందోళనలో తలైవా.. కారణం ఆ సినిమానే!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus