Hide N Seek Review in Telugu: హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 20, 2024 / 10:05 AM IST

Cast & Crew

  • విశ్వాంత్ (Hero)
  • శిల్పా మంజునాథ్ (Heroine)
  • రియా సచ్ దేవా, సాక్షి శివ తదితరులు.. (Cast)
  • బసిరెడ్డి రానా (Director)
  • నరేంద్ర బుచ్చిరెడ్డిగారి (Producer)
  • లిజో కే.జోస్ (Music)
  • చిన్నా రామ్ (Cinematography)
  • Release Date : సెప్టెంబర్ 20, 2024

తెలుగు హీరో విశ్వాంత్(Viswant), కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ (Shilpa Manjunath) కీలకపాత్రలు పోషించిన చిత్రం “హైడ్ న్ సీక్”. బసిరెడ్డి రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మోడ్రన్ మిస్టరీ థ్రిల్లర్ నేడు (సెప్టెంబర్ 20) విడుదలైంది. ట్రైలర్ అయితే కాస్త ఆసక్తికరంగానే ఉంది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

Hide N Seek Story

కథ: కర్నూల్ నగరంలో ఉన్నట్లుండి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. కారణం లేని హత్యలు, అర్థం కానీ నేరాలతో నగరం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. ఈ వరుస మర్డర్ మిస్టరీలను ఛేదించేందుకు రంగంలోకి దిగుతుంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైష్ణవి (శిల్పా మంజునాథ్). పోలీసులు సైతం కనిపెట్టలేకపోతున్న కొన్ని క్లూస్ ను వాళ్లకు సీక్రెట్ గా పంపిస్తుంటాడు మెడికల్ స్టూడెంట్ శివ (విశ్వాంత్). కట్ చేస్తే.. పోలీసులకు సహాయపడుతున్న శివనే సైకో కిల్లర్ గా అనుమానిస్తారు పోలీసులు. అసలు శివను ఈ హత్యల్లో ఇరికించింది ఎవరు? కర్నూల్లో ఏం జరుగుతుంది? ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “హెడ్ న్ సీక్” చిత్రం.

నటీనటుల పనితీరు: తెలుగులో ఇదివరకు “మనమంతా, జెర్సీ” వంటి చిత్రాల్లో నటించిన విశ్వాంత్ ఈ చిత్రంలో శివ అనే పాత్రలో చక్కని నటన కనబరిచాడు. పాత్రకు మంచి వెయిటేజ్ ఉంది, దాన్ని విశ్వాంత్ చక్కగా క్యారీ చేశాడు. కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ లుక్స్ వైజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా సూట్ అయ్యింది. తెలుగు డైలాగ్స్ విషయంలో ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడిన తీరు ప్రశంసార్హం. అయితే.. ఆమె పాత్రలోఒదిగిపోయినప్పటికీ, ఆమె క్యారెక్టర్ ఆర్క్ అనేది సరిగా లేకపోవడం వల్ల సరిగా ఎలివేట్ అవ్వలేదు.

హీరోయిన్ రియా సచ్ దేవా కొన్ని సీన్లకే పరిమితం అయిపోయింది. సాక్షి శివ తన వాయిస్ లోని బేస్ తో నెగిటివ్ క్యారెక్టర్ కు మంచి వేల్యూ యాడ్ చేశాడు. అయితే.. క్యారెక్టర్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల అది కూడా కనెక్ట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: లిజో కే.జోస్ నేపథ్య సంగీతం సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్. పాటలు వర్కవుట్ అవ్వలేదు కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. చిన్నా రామ్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. అయితే.. ప్రొడక్షన్ డిజైన్ వర్క్ మాత్రం చాలా బ్యాడ్. ఎంత లిమిటెడ్ బడ్జెట్ సినిమా అయినప్పటికీ.. మరీ క్లైమాక్స్ లో గ్యాస్ గార్డ్ మాస్క్ కి బదులు ఫేస్ హెల్మెట్ ను వాడడం అనేది కామెడీ అయిపోయింది. గేమింగ్ అనే థీమ్ ను మూలకథగా ఎంచుకున్నప్పుడు ప్రొడక్షన్ & ఆర్ట్ వర్క్ విషయంలో కనీస స్థాయి జాగ్రత్త తీసుకోకపోవడం బాధాకరం.

దర్శకుడు బసిరెడ్డి రానా ఎంచుకున్న కథలో మోడ్రన్ వార్ ఫేర్, వర్చువల్ గేమింగ్ లాంటి ఫ్యూచరిస్టిక్ థాట్స్ ఉన్నప్పటికీ.. వాటిని కర్నూలు లాంటి ఒక చిన్న సిటీలో ఇరికించడానికి ప్రయత్నం బెడిసికొట్టింది. అలాగే.. గేమింగ్ కి యువత బానిసవుతున్నారు అనే అంశాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. “బ్లూ వేల్ ఛాలెంజ్, పోకెమాన్ గో” అనే రియల్ ఇన్సిడెంట్స్ నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ.. సినిమాలో గేమ్ ను ఆ స్థాయిలో ఇక్కడ ఎలివేట్ చేయలేకపోయాడు. ఇక హ్యూమన్ ఎమోషన్స్ ను కూడా సరిగా క్యారీ చేయలేకపోయాడు. ఓవరాల్ గా ఆలోచనారూపంగా బాగున్నప్పటికీ.. ఆచరణ విషయంలో మాత్రం బెడిసికొట్టింది. అందువల్ల కథకుడిగా పర్వాలేదు అనిపించుకున్నా.. దర్శకుడిగా మాత్రం విఫలమయ్యాడు.

Hide N Seek Review

విశ్లేషణ: గేమింగ్ మీద అవగాహన, గేమింగ్ కారణంగా జరిగిన దారుణ నేరాలు తెలిసి ఉంటేనే “హైడ్ న్ సీక్” సినిమాకి కాస్త కనెక్ట్ అవ్వగలం. కాకపోతే.. ప్రొడక్షన్ డిజైన్ చాలా వీక్ గా ఉండడం, క్యారెక్టర్ ఆర్క్స్ సరిగా రాసుకోకపోవడం, మరీ ముఖ్యంగా “మారణకాండ” అనే కాన్సెప్ట్ ను ఎస్టాబ్లిష్ చేయడం కోసం చరిత్రలో జరిగింది అంటూ రాసిన సపరేట్ ట్రాక్ కి మెయిన్ ట్రాక్ తో సరిగా కనెక్ట్ అవ్వకపోవడం కారణంగా “హైడ్ న్ సీక్” ప్రేక్షకులను అలరించలేకపోయింది.

ఫోకస్ పాయింట్: ప్రేక్షకుల బుర్రతో ఆడిన గేమ్ వర్కవుట్ అవ్వలేదు!

Hide N Seek Rating

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus