The Mystery Of Moksha Island Review in Telugu: ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • September 20, 2024 / 07:11 PM IST

Cast & Crew

  • నందు విజయ్ కృష్ణ (Hero)
  • తేజస్వీ మడివాడ, అక్షర గౌడ, ప్రియ ఆనంద్ (Heroine)
  • అశుతోష్ రాణా, పావని రెడ్డి, రోషన్ కొనకాల, నయన్ సారిక తదితరులు.. (Cast)
  • అనీష్ కురువిల్లా (Director)
  • గోపీచంద్ ఆచంట (Producer)
  • శక్తికాంత్ కార్తీక్ (Music)
  • నవీన్ యాదవ్ (Cinematography)

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యమ బిజీ అయిపోయిన అనీష్ కురువిల్లా దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ “ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్” (The Mystery Of Moksha Island ) . హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ 8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ప్రమోషనల్ కంటెంట్ అయితే బానే ఉంది, మరి సిరీస్ ఎలా ఉందో చూద్దాం..!!

The Mystery Of Moksha Island Review

కథ: నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ శాస్త్రవేత్త విశ్వక్ సేన్ (అశుతోష్ రాణా) ఓ ఫ్లైట్ యాక్సిడెంట్ లో మరణిస్తాడు. అతడి ఆస్తి దాదాపు 24,000 కోట్ల రూపాయలు. ఆ ఆస్తిని తనకు సంబంధించిన వారందరికీ సమానంగా పంచాలని వీలునామా రాస్తాడు. అయితే.. ఆ ఆస్తిలో భాగస్వామ్యం సంపాదించుకోవాలంటే మోక్ష ఐలాండ్ లో వారం రోజులపాటు ఉండాలని రూల్ పెడతాడు. ఈ నిబంధనకు అంగీకరించిన విశ్వక్ సేన్ కుటుంబ సభ్యులైన వారందరూ మోక్ష ఐలాండ్ లో నివసించడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఒక్కొక్కరు మిస్ అవ్వడం జరుగుతుంది.

అసలు మోక్ష ఐలాండ్ లో అందరూ వారం రోజులు ఉండాలని విశ్వక్ సేన్ ఎందుకు నిబంధన విధించాడు? ఆ ఐలాండ్ లో ఏముంది? ఎందుకని ఒక్కొక్కరిగా జనాలు చనిపోతుంటారు? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ (The Mystery Of Moksha Island ) సిరీస్.

నటీనటుల పనితీరు: సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక నందు పోషించిన పాత్రల్లో విక్కీ చెప్పుకోదగ్గ పాత్ర. షార్ప్ షూటర్ గా, తన అక్కను వెతుక్కునే తమ్ముడిగా మంచి నటన కనబరిచాడు. ప్రియా ఆనంద్ కూడా మంచి నటన కనబరించింది. తేజస్వీ మడివాడ, పావని సపోర్టింగ్ రోల్స్ లో పర్వాలేదనిపించుకున్నాడు. అక్షర గౌడ సిరీస్ కు గ్లామర్ అద్దడానికి ప్రయత్నించినప్పటికీ.. పెద్దగా ఫలించలేదు. ఇంకా చాలా మంది క్యాసింట్ ఉన్నప్పటికీ.. వారిలో చెప్పుకోదగ్గ నటన కనబరిచినవాడు మాత్రం రోషన్ కనకాల. ఒక సెన్సిటివ్ క్యారెక్టర్ ను బాగా అందర్ ప్లే చేశాడు.

సాంకేతికవర్గం పనితీరు: నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సిరీస్ మొత్తం ఒక లొకేషన్ లోనే సాగినప్పటికీ, రిపిటేషన్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. ముఖ్యంగా.. బీచ్ ఎపిసోడ్స్ ను బాగా చూపించాడు. ఈ సిరీస్ కి ఆర్ట్ వర్క్ కూడా ప్లస్ అయ్యింది. తక్కువ ఖర్చులో మంచి అవుట్ పుట్ ఇచ్చారు బృందం. ల్యాబ్ సెటప్ చాలా సహజంగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ టీమ్ పనితనాన్ని ఈ విషయంలో మెచ్చుకోవాలి. శక్తికాంత్ కార్తీక్ నేపథ్య సంగీతం పర్వాలేదు అనిపించుకొంది.

దర్శకుడు అనీష్ కురువిల్లా సిరీస్ ను రాసుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా.. మనుషులు తమకు సమస్య ఎదురైనప్పుడు, సదరు రియాలిటీ నుండి పారిపోవడానికి ప్రయత్నించే విధానాన్ని చాలా పాత్రల ద్వారా చూపించాడు. అదే విధంగా మనిషిలో “స్వార్థం, ఆశ, కామం, క్రోధం” వంటి కంట్రోల్ చేసుకోలేనటువంటి ఎమోషన్స్ వల్ల మనిషి ఎంత దిగజారుతాడు? ఎంతకి తెగిస్తాడు? వంటి అంశాలను తెరపై చూపించిన విధానం కూడా బాగుంది.

అయితే.. పాత్రధారులు మరీ ఎక్కువ మంది అయిపోవడంతో ఏ ఒక్క క్యారెక్టర్ సరిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఈ కారణాలుగా అనీష్ కురువిల్లా దర్శకుడిగా కంటే కథకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. కాస్త లిమిటెడ్ క్యారెక్టర్ రాసి ఉంటే మాత్రం సిరీస్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది. అశుతోష్ రాణా పాత్రను బిల్డ్ చేసి ఎస్టాబ్లిష్ చేసిన తీరు బాగున్నా.. మిగతా కీలకపాత్రధారులైన నందు, ప్రియ ఆనంద్ పాత్రలు కూడా ఇంకాస్త చక్కగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది.

విశ్లేషణ: తెలుగులో ఈ కాన్సెప్ట్ లో “లాక్డ్” అనే వెబ్ సిరీస్ లాక్ డౌన్ టైమ్ లో వచ్చి మంచి హిట్ అయ్యింది. ఇంచుమించుగా అదే తరహాలో “ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్”ను రాసుకున్నాడు అనీష్ కురువిల్లా. అయితే.. రాతలో అద్భుతంగా వర్కవుట్ అయినా తీతలో మాత్రం ఎమోషన్ మిస్ అయ్యింది. అయినప్పటికీ.. ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల లోపే ఉండడం, ప్రొడక్షన్ డిజైన్ బాగుండడం, కథనం ఆసక్తికరంగా సాగడంతో ఓవరాల్ గా ఓ మోస్తరుగా ఆకట్టుకోగలిగింది.

ఫోకస్ పాయింట్: క్రేజీ పాయింట్.. టైమ్ పాస్ సిరీస్ లా మిగిలిపోయింది!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus