టాలీవుడ్ నటుడు విజయ్ సాయి అందరికీ సుపరిచితమే. హీరోగా, హీరోకి ఫ్రెండుగా, కమెడియన్ గా.. చాలా హిట్ సినిమాల్లో నటించాడు. అయితే 2017 లో ఇతను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.అందుకు కారణం ఇతని పర్సనల్ లైఫ్ లో వచ్చిన సమస్యలే అని అప్పట్లో టాక్ నడిచింది. 2006లో నటి వనితా రెడ్డి అనే అమ్మాయిని ఇతను పెళ్లి చేసుకున్నాడు. కానీ, కొంతకాలానికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
2015లో వీళ్ళు విడిపోయారు. 2017 లో విజయ్ సాయి తన గదిలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. తన చావుకి.. అతని మాజీ భార్య వనితాయే కారణమంటూ సూసైడు నోట్లో రాయడమే కాకుండా సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీని పై అతని భార్య వనితా రెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె మాట్లాడుతూ.. ” ‘వాల్ పోస్టర్’ అనే మూవీ షూటింగ్లో విజయ్ సరసన నటించాను. ఆ సినిమా షూటింగ్లోనే మేము దగ్గరయ్యాం.
ఇద్దరం ప్రేమించుకున్నాం. రైల్లో ఉన్నప్పుడే నాకు రింగు తొడిగాడు. ఇంట్లో పెద్దవాళ్ళు మా ప్రేమను ఒప్పుకోలేదు. అప్పుడు శ్రీశైలం వెళ్లగా అక్కడ కారులోనే నాకు పసుపుతాడు కట్టేశాడు. నేను అ పసుపుతాడు ఎవరికీ కనబడకుండా జాగ్రత్తపడేదాన్ని. ఒకానొక టైంలో మా అమ్మకు దొరికిపోయాను. దీంతో తను రోడ్డుపైనే నా తాళి తెంపేసి రచ్చ చేసింది. దాంతో మా ఇంట్లో నుండి డబ్బు, బంగారం తీసుకుని పారిపోయి విజయ్ దగ్గరకు వెళ్లాను. అప్పుడు యాదగిరిగుట్టలో మళ్ళీ పెళ్లి చేసుకున్నాం.
కానీ పెళ్లైన 13 రోజులకే నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. నాకు సినిమా ఛాన్సులు వస్తే చేయకూడదని కండీషన్లు పెట్టాడు. మా ఇంటి నుంచి డబ్బు తీసుకురమ్మని హింస పెట్టేవాడు. అలా నా డబ్బు అతను చాలా వాడుకున్నాడు. అతడి వేధింపులు భరించలేక 2013లోనే విడాకులకు అప్లై చేశాను. మాకు ఓ పాప ఉంది. కోర్టు నిర్ణయం ప్రకారం ప్రతివారం పాపను చూపించాలన్నారు. అలా నా కూతురు వారంలో ఒకరోజు తనతో (Vijay Sai) ఉండేది.
మిగిలిన రోజులు నా దగ్గర ఉండేది. ఆ తర్వాత నా స్థానంలో ఇంకొకరిని తీసుకొని వచ్చాడు! పెళ్లి కాకముందే తనకు మరో అమ్మాయితో ఎఫైర్ ఉంది. ఈ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. కానీ చనిపోయినప్పుడు అతన్ని పట్టుకుని గట్టిగా ఏడ్చాను. ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావని గుండె బద్దలయ్యేలా ఏడ్చాను. ఇప్పటికీ కొన్ని కేసులు కోర్టులోనే ఉన్నాయి. నా కూతురి కోసం ఇప్పుడిప్పుడే నా కెరీర్ పై ఫోకస్ పెట్టాను” అంటూ ఆమె వనితా రెడ్డి చెప్పుకొచ్చింది.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు