చంద్రశేఖర్ యేలేటి.. తన కెరీర్ ప్రారంభం నుండీ విభిన్నమైన చిత్రాలనే తెరకెక్కిస్తున్నాడు. ‘ఐతే’ ‘అనుకోకుండా ఒకరోజు’ వంటి చిత్రాలను చూస్తే.. వాటి స్క్రీన్ ప్లే అంత తొందరగా మైండ్లో నుండీ వెళ్లిపోదు. అయితే అవి తక్కువ బడ్జెట్ సినిమాలు కాబట్టి.. కమర్షియల్ గా కూడా సేఫ్ అయిపోయాయి. అయితే ‘ఒక్కడున్నాడు’ ‘ప్రయాణం’ ‘సాహసం’ ‘మనమంతా’ వంటి చిత్రాలు రిలీజ్ రోజు నుండీ మంచి మౌత్ టాక్ ను సంపాదించుకున్నా.. మంచి రివ్యూలను రేటింగ్ లను సాధించినా.. కమర్షియల్ గా అయితే వర్కౌట్ కాలేదు.
కాబట్టి.. ఆ ఒక్క లోటు యేలేటికి అలాగే ఉండిపోయింది. దాంతో ఈసారి ఎలాగైనా కమర్షియల్ హిట్ కొట్టాలని నితిన్ తో ‘చెక్’ చేసాడు. ‘భవ్య క్రియేషన్స్’ పై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని రాజీ పడకుండా.. బడ్జెట్ కు వెనుకాడకుండా నిర్మించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి మంచి టాకే వస్తోంది. అయితే ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదయ్యే అవకాశాలు కనబడడం లేదు అనేది ట్రేడ్ పండితుల సమాచారం. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే.. రూ16.60 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయని వినికిడి.
మొదటి రోజు ఈ చిత్రం రూ.3కోట్ల నుండీ రూ.4కోట్ల షేర్ ను నమోదు చేసే అవకాశం ఉందని టాక్ బట్టి అంచనా వేశారు. కానీ టికెట్స్ ఆ స్థాయిలో తెగడం లేదని తెలుస్తుంది. కేవలం ఈరోజు మాత్రమే కాదు గత 4 రోజుల నుండీ జనాలు థియేటర్లకు రావడం తగ్గించారు. కరోనా మళ్ళీ పుంజుకుంటున్న నేపథ్యంలో వారు థియేటర్లకు రావడం నిరాకరిస్తున్నట్టు టాక్. మరోపక్క పరీక్షల హడావిడి కూడా మొదలైంది. కాబట్టి.. ఈ వీకెండ్ మొత్తం ‘చెక్’ మంచి వసూళ్లు సాధిస్తే ఒకే..! లేదంటే యేలేటికి ఈసారి కూడా నిరాశ తప్పదనే చెప్పాలి..!
Most Recommended Video
చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!