Doosara: గంగూలీ ‘బయోపిక్’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే
- October 23, 2026 / 04:05 PM ISTByFilmy Focus Desk
తెలుగులో ‘దాదా’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నరు. ఇది కాకుండా బాలీవుడ్లో మరో ‘దాదా’ సినిమా రూపొందుతోంది. ఇది ప్రముఖ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే గంగూలీ ఐకానిక్ మూమెంట్స్‌తో మరో సినిమా రూపొందుతోంది. బయోపిక్ కాని బయోపిక్ అయిన ఆ సినిమానే ‘దూస్రా’.
Doosara
ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ సౌరవ్ గంగూలీ ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 23న థియేటర్లలో విడుదల అవుతున్న ‘దూస్రా’ సినిమాను నిలిపివేయాలని ఆయన స్టే కోరారు. అయితే స్టే ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. సినిమా నిర్మాణ సంస్థ లవ్ ఫిల్మ్స్ ఎల్ఎల్పీ తన ఓ సిరీస్ ఫైనల్లో తన ఆటను, లార్డ్స్‌లో చొక్కా తీసి చేసుకున్న వేడుకను వినియోగించారని ఆ పిటిషన్ గంగూలీ ప్రస్తావించారు.
నిర్మాతల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఈ సినిమా బయోపిక్ కాదని, గంగూలీకి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్‌ల వాడకానికి నిర్మాత అనుమతులు తీసుకున్నారని చెప్పారు. ఈ సినిమా నిర్మాణానికి గంగూలీ నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదని, ఆయన వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని గంగూలీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం సినిమా విడుదలను నిలిపివేయడానికి నిరాకరించింది.
నిజానికి ‘దూస్రా’ గంగూలీ బయోపిక్ కాదు. అభినయ్ డియో దర్శకత్వం వహించిన ఈ సినిమా తారా అనే యువతి చుట్టూ కథ తిరుగుతుంది. సంప్రదాయాలు, పురుషాధిక్య భావజాలం ఉన్న కుటుంబ వాతావరణంలో పెరిగే ఆమెకు, 2002లో టీమ్ ఇండియా సాధించిన విజయం స్ఫూర్తినిస్తుంది. గంగూలీ ఐకానిక్ సంబరాలు ఆమె ఆలోచనల్లో మార్పు తీసుకొస్తాయి. దాని కోసమే ఆ సీన్స్ వాడుకున్నారు. ఆ లెక్కన ఆ సినిమా తారా బయోపిక్.











