Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

మాస్ క దాస్ విశ్వక్ సేన్ కి చాలా కాలంగా హిట్ లేదు. 2024 ఆరంభంలో వచ్చిన ‘గామి’ తర్వాత విశ్వక్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది అనుదీప్ తో చేసిన ‘ఫంకీ’ సైతం అతన్ని గట్టెక్కించలేకపోయింది. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో తన దర్శకత్వంలోనే ‘కల్ట్'(Cult) అనే సినిమా చేశాడు. ‘తారక్ సినిమాస్’ సంస్థపై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ వంటివి చాలా వయొలెంట్ గా అనిపించాయి.

Cult

సెన్సార్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఈ సినిమా. ‘A’ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ సెన్సార్ వాళ్ళు ఈ సినిమాలో చాలా సన్నివేశాలు కట్ చేశారు. ఇది ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే నమోదయ్యాయి.4వ రోజు ఈ సినిమా కలెక్షన్స్ మరింత డౌన్ అయ్యాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే  :

నైజాం  0.92 cr
సీడెడ్  0.16 cr
ఆంధ్ర(టోటల్)  0.56 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)  1.64 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.28 cr
ఓవర్సీస్  0.54 cr
వరల్డ్ వైడ్(టోటల్)   2.46 cr(షేర్)

‘కల్ట్’ సినిమాకి రూ.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి రూ.2.46 కోట్ల షేర్ నమోదైంది. గ్రాస్ పరంగా రూ.4.50 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.6.04 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది.

రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus